మిరప రైతుల విలాపాలపై చంద్రబాబు చేతులెత్తేసినట్టే!

చంద్రబాబునాయుడు అధికారంలో రైతులకు కష్టాలు తప్పవనే ఒక ప్రచారం ఆయన వ్యతిరేకులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిరప రైతు కష్టాలను ఆ ప్రచారంతో పోల్చిచూస్తున్నారు ప్రజలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సాగించే వ్యాపార పంటల్లో మిరప కూడా ఒకటి. ఈ ఏడాది మిరప పంటకు సరైన ధర లేకపోవడంతో.. పండించిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు గుంటూరుతో పాటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మిరప కొనుగోళ్లు జరిగే ప్రతి యార్డులోనూ రైతుల వేదనలు మిన్నంటుతున్నాయి. గత ఏడాది క్వింటాల్ 23 వేల వరకు ధర పలకగా, ఈ ఏడాది ఒక క్వింటాలు అత్యంత నాణ్యమైన మిరప ధర రూ.13 వేలకు మించకపోవడం.. మిరప రైతులను కుదేలు చేసేస్తోంది. ఇలాంటి సమయంలో ఏ యార్డులో రైతులను కదిలించినా.. ప్రభుత్వం ఏదో ఒకటి చేసుకోవాలని కోరుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మిరప ధరల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఆయన చాలా సునాయాసంగా పలాయనవాదం ప్రదర్శించడం గమనార్హం. మిరప రైతుల కష్టాల గురించి తాను చేసేదేమీ లేదని, దేవుడే దిక్కన్నట్టుగా ఆయన స్పందన ఉన్నదని, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిరప రైతుల కష్టాల గురించి కేంద్రానికి నివేదిద్దాం అనే ఒక్క తీర్మానంతో చంద్రబాబు చేతులు దులుపుకున్నట్టుగా రైతులు ఆవేదన చెందుతున్నారు.

చంద్రబాబునాయుడు అధికారంలో రైతులకు కష్టాలు తప్పవనే ఒక ప్రచారం ఆయన వ్యతిరేకులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిరప రైతు కష్టాలను ఆ ప్రచారంతో పోల్చిచూస్తున్నారు ప్రజలు! పైగా చంద్రబాబు అధికారంలోంచి దిగిపోయే ముందునాటి పరిస్థితుల్ని కూడా పోల్చి చూసుకుంటున్నారు. 2019లో చంద్రబాబునాయుడు అధికారంలోంచి దిగిపోవడానికి ముందు మిరప ధర క్వింటాలుకు గరిష్టంగా 7-8 వేల రూపాయలు మాత్రమే పలికింది. అప్పట్లో కనీసం కోతకూలీలు కూడా గిట్టుబాటు కాకుండా.. సర్వనాశనం అయిపోతున్నాం అంటూ మిరప రైతుల హాహాకారాలు మిన్నంటాయి. కానీ చంద్రబాబునాయుడు పట్టించుకున్నది మాత్రం లేదు.

తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. మిరప ధరలు మంచిగానే ఉన్నాయి. గత రెండేళ్లుగా కూడా నాణ్యమైన మిరప ధర క్వింటాలు 23 వేల పలికింది. రైతులు లాభపడ్డారు. చంద్రబాబు రాగానే ధరలు దారుణంగా పడిపోయాయి. కారణం ఆయనకాకపోవచ్చు. యాదృచ్ఛికమే కావొచ్చు. కానీ రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం దృష్టిపెట్టడం అవసరం. ఆయన మాత్రం.. పట్టించుకోవడం లేదు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ‘కేంద్రానికి చెబుదాం’ అంటున్నారు.

రైతులకు సాయంపై కేంద్రాన్ని అడుగుదాం అంటున్నారు. అంటే తమ రాష్ట్రప్రభుత్వం తరఫు నుంచి రైతుల్ని ఆదుకోవడానికి పైసా కూడా విడిలించే ఉద్దేశంతో చంద్రబాబు లేరని అర్థమైపోతోంది. డిసెంబరులో కూడా కేంద్రానికి రెండు లేఖలు రాశారు. తన పార్టీ మంత్రులతో మంతనాలు కూడా చేయించారు. వాటివల్ల రాని ఫలితం.. ఇప్పుడు కొత్తగా మరోసారి నివేదిస్తే వస్తుందా.. చంద్రబాబునాయుడుకు రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్రప్రభుత్వం తరఫున వారికి మద్దతుగా ఏం చేయగలరో నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

32 Replies to “మిరప రైతుల విలాపాలపై చంద్రబాబు చేతులెత్తేసినట్టే!”

    1. 2.0 గురించేనా.. బట్టలిపించేస్తాడు.. జాగ్రత్త..

      మగాళ్ల శీలాలకు ముందుంది ముసళ్ల పండగ..

    1. పథకాలన్నీ 99.99% చేసేసి.. మమ్మల్ని కూడా 11 కి పడిపోమంటావా నీ జగన్ రెడ్డి లాగా..

      ఆశ.. దోసె .. అప్పడం.. వడ..

      మా రాష్ట్రానికి అభివృద్ధి చాలు.. ఇష్టం లేకుంటే ముష్టి వేసే వేరే రాష్ట్రం చూసుకోండి..

      1. pathakaalu ivvakane 83000 kotla appu chesindi kada !! 23000 kotlu mundu CS elections appudu anukunna 50000 cr appu chesindi kada .. pension thappa penchindi emi ledu .. andulonu 3 laksh old age pensions theesesaru . capital expenditure ki karchu pettindi 10000 kotlu . ha ha

        ee lakkana schemes isthe lakha kotlu datipothundi . ha ha

        1. 23000 కోట్లు అప్పు కూడా తిరిగి కట్టారు.. (వడ్డీలు కాకుండా ).. ఆ విషయం సీఎం చంద్రబాబు గత నెల క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారు చూసుకో..

          ఈ లెక్కలు నీకు సాక్షి చెప్పదులే ..

          ..

          నీ జగన్ రెడ్డి దొబ్బేసిన ఉద్యోగుల బకాయిలు.. తిరిగి వాళ్ళ ఖాతాల్లో వేశారు..

          ఆరోగ్యశ్రీ బకాయిలు 1600 కోట్లు తీర్చేసారు..

          కాంట్రాక్టర్స్ అప్పులు 1200 కోట్ల మేర కట్టేశారు..

          అమ్మఒడి బకాయిలు 500 కోట్లు.. అది కూడా కట్టేశారు.. (నీ జగన్ రెడ్డి బటన్లు నొక్కి పారిపోయాడు)

          విద్యుత్ బకాయిలు కొంతమేర చెల్లించారు..

          జగన్ రెడ్డి డ్వాక్రా మహిళల అకౌంట్స్ నుండి దొబ్బేసిన డబ్బు.. తిరిగి చెల్లించారు..

          ఇంకా చాలా చిన్న చితకా అప్పులు.. కట్టుకుంటూ వెళుతున్నారు..

          ..

          బుద్ది ఉన్నవాడివైతే.. ముందు అప్పులు తీర్చుకోవాలి.. ఆ తర్వాతే పచ్చడి అన్నం అయినా తినగలం అని అర్థం చేసుకోవాలి ..

          1. asalu arogya sree vunte kada AP lo . every gov keep opending bills . 2019 lo Jagan paid so many dues . chivaraku 400 cr raithula Vithanalaku cheyyaleka vellipoyadu .. 2019 lo tharuvaatha vachhna prabhthyam theerchindi ..

            arogya sree ki ekkada pay chesindo choopiste koddiga tharisthamu .

            every gov pay loans + interest

          2. కొంపదీసి 2019 లో చంద్రబాబు చేసిన అప్పులన్నీ జగన్ రెడ్డి తీర్చేసాడని అనుకొంటున్నావా రంజితం..?

            ఇంత బానిసత్వమా..?

            ..

            ఇక్కడ ఎవడు ఎక్కువ అప్పు చేసాడని నేను నీతో వాదించడం లేదు..

            ఇప్పుడున్న అప్పులను ఎలా తీర్చేసుకుని గట్టెక్కాలో.. ఆలోచించమని చెపుతున్నాను..

            అయినా నీకు అంత తెలివి ఎక్కడ ఏడ్చిందిలే..

            జగన్ రెడ్డి ముష్టి పడేస్తే తిందామని వెయిట్ చేస్తున్నట్టున్నావు ..

          3. ప్రస్తుతం అప్పు దాదాపు 10 లక్షల కోట్లు పై మాటే.. ఈ ఐదేళ్లలో సగం అప్పు.. అంటే 5 లక్షల కోట్ల అప్పు తీర్చేసినా.. రాష్ట్ర అభివృద్ధి కి తిరుగుండదు..

            చేస్తాం … చేసి చూపిస్తాం..

          4. antha cinema ledu lol ha ha . 20000 cr to 25000 cr principle ( not interest ) need to pay per year . so 1 to 1.2 lakh cr principle will be paid . CBN wont pay single penny more than that . CBN ruled just 5 years back . don’t forget that LOL ha ha

          5. నాలుగేళ్ల తర్వాత వచ్చి కనపడు..

            చేస్తాం … చేసి చూపిస్తాం..

            అంతవరకు.. జగన్ రెడ్డి కోసం బట్టలూడదీసుకుని తిరుగుతూ ఉండు.. మీ నాయకుడు సంతోషిస్తాడు..

      2. abhivruddi ki ee samvasthram babu gaaru karchu pettinndi 10000 kotlu . appu 83000 kotlu jan ke . 23000 kotlu mundu CS elections appudu anukunna 50000 cr appu pathakalu ivvakundane ..

        1. జగన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయాక.. ఇక ఏమి కార్పొరేషన్స్ మిగిలాయని అప్పులు ఇవ్వడానికి?

          తెలిస్తే రాయి.. సొల్లు మింగమాకు..

          చివరికి.. మద్యం రాబడి కూడా తాకట్టు పెట్టేసిన మహానుభావుడు.. నీ అభివృద్ధి మాంత్రికుడు జగన్ రెడ్డి..

          1. ఓహో.. మరి ఇదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది..?

          2. పైన క్లియర్ గా రాసాను.. చదివి రిప్లై చేయండి..

            నీకు తోచింది రాసుకుని.. ఇంకా ఇంకా దిగజారిపోకండి..

          3. EJAYRanjith R59m

            24000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి.. ఆల్రెడీ 36000 కోట్లు బకాయిలు ఉన్నాయి..

            ఆ విషయం సీఎం చంద్రబాబు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పారు.. అంటే జులై 2024 లో

            ..

            ఇప్పుడు దానిపైన ఇంకో 8000 కోట్లు అప్పు ఇచ్చారా..?

            అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి..

            ..

            ఈ అప్పులన్నీ ఎవడు తీరుస్తాడు..

            ఎంతో కొంత చదువుకొనే ఉంటావు కదా..?

            సంక్షేమం అని మాటిచ్చాడు అని గగ్గోలు పెడుతున్నావే.. ఇప్పుడు తినేసి ఊరేగే నీలాంటోళ్లకు పంచి పెట్టాలా..?

            లేక అప్పులు తీర్చేసుకుని.. బాగు పడాలా..?

            నువ్వైతే ఏమి చేస్తావు?

            ..

            పోనీ.. 4 లక్షల కోట్లు పంచేసాడని చెప్పుకొంటున్న జగన్ రెడ్డి.. బావుకున్నది ఏమైనా ఉందా..?

            రాష్ట్రం ముఖ్యమా..? జగన్ రెడ్డి కి అధికారం ముఖ్యమా..?

            పంచడం ముఖ్యమా..? భవిష్యత్తు ముఖ్యమా..?

            ..

            ఇప్పటికే వందల సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను.. మీ బతుకులకు జగన్ రెడ్డి ని సీఎం సీట్లో కూర్చోబెట్టి.. వాడు పడేసే ముష్టి తిని బతికేయాలని తాపత్రయం.. అంతే మీ బతుకులు..

          4. 24000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి.. ఆల్రెడీ 36000 కోట్లు బకాయిలు ఉన్నాయి..

            ఆ విషయం సీఎం చంద్రబాబు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పారు.. అంటే జులై 2024 లో

            ..

            ఇప్పుడు దానిపైన ఇంకో 8000 కోట్లు అప్పు ఇచ్చారా..?

            అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి..

            ..

            ఈ అప్పులన్నీ ఎవడు తీరుస్తాడు..

            ఎంతో కొంత చదువుకొనే ఉంటావు కదా..?

            సంక్షేమం అని మాటిచ్చాడు అని గగ్గోలు పెడుతున్నావే.. ఇప్పుడు తినేసి ఊరేగే నీలాంటోళ్లకు పంచి పెట్టాలా..?

            లేక అప్పులు తీర్చేసుకుని.. బాగు పడాలా..?

            నువ్వైతే ఏమి చేస్తావు?

Comments are closed.