పవన్ లోగుట్టును బయటపెట్టిన కిరణ్ రాయల్!

పవన్ కల్యాణ్ తన పార్టీ వారికి నామినేటెడ్ పదవులను దోచుకోవడం కోసమే కట్టబెడుతున్నట్టుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ప్రజల్లో కొంత మంచి పేరు సంపాదించుకున్నారు. అప్పటిదాకా ఆయన అధికారం చవిచూసిన నాయకుడు కాకపోవడం అందుకు ఒక కారణం. అధికారం చూసిన వాడు కాదు గనుక.. ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా, అప్పటికి, లేకపోవడం కారణం. పైగా తాను కష్టపడి సినిమాలు చేసి డబ్బు సంపాదించి, పన్నులు కడుతూ.. రాజకీయాలకు కూడా ఖర్చు పెడుతున్నానని ఆయన బీద పలుకులు పలికారు. తమ పార్టీ వారి వద్ద డబ్బులు లేవని, డబ్బుల్లేని రాజకీయం చేయాలని అనుకుంటున్నామని.. ఆయన ధర్మపన్నాలు వల్లించారు.

రాష్ట్ర ప్రజలు ఆ మాటలను కూడా కొంత మేర నమ్మారు. కనుకనే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను నూరుశాతం గెలిపించారు. అయితే.. పవన్ కల్యాణ్ నిజంగానే క్లీన్ పాలిటిక్స్ చేశారా? పవన్ యొక్క అసలు గుట్టు ఏమిటి? తెర వెనుక వాస్తవాల్ని ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ స్వయంగా బయటపెట్టడం విశేషం. కిరణ్ రాయల్ మాటల ద్వారా.. పవన్ బండారం బద్దలైంది.

తిరుపతికి చెందిన కిరణ్ రాయల్, అనైతిక వివాహేతర సంబంధాలు, వేధింపుల వ్యవహారంలో కొన్ని వారాలుగా భ్రష్టుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. లక్ష్మి అనే మహిళ.. కిరణ్ రాయల్ బాగోతాన్ని మీడియా సాక్షిగా బట్టబయలు చేసి కేసులు కూడా నడుపుతోంది. కాగా తాజాగా ఆమెతో గతంలో కిరణ్ రాయల్ చేసిన ఫోను సంభాషణలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

తనకు అమ్మాయిల పిచ్చి ఉన్నదని, అది తన వీక్ నెస్ అని, తాను ఏమీ చేయలేనని… చచ్చేదాకా అమ్మాయిల పిచ్చితోనే ఉంటానని.. అనేక రకాల లేకిమాటలను కిరణ్ రాయల్ ఆమెతో మాట్లాడడం అంతా ఒక ఎత్తు! క్లీన్ పాలిటిక్స్ ముసుగులో పవన్ కల్యాణ్ అనుసరించిన నీతిమాలిన రాజకీయాల అసలు గుట్టును బయటపెట్టడం ఇంకో ఎత్తు! అప్పటికే ఆ లక్ష్మి అనే మహిళ నుంచి కోట్లలో సొమ్ములు తీసుకుని ఉన్న కిరణ్ రాయల్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆమె సొమ్ము మొత్తం తిరిగి ఇస్తానని చెబుతూ.. తనకు ఎమ్మెల్యే టికెట్ పార్టీ నిరాకరించిందని కూడా చెప్పుకున్నారు.

ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే.. 20 కోట్ల రూపాయలు ఖ‌ర్చు పెట్టుకోవాలని పార్టీ చెప్పిందని.. తన వద్ద అంత డబ్బు లేదనడంతో పార్టీ టికెట్ ఇవ్వడం లేదని ఆయన స్వయంగా చెప్పారు. అంటే.. డబ్బు వెదజల్లి గెలవడానికి కనీసం 20 కోట్లు పెట్టుకోగల వారిని మాత్రమే పవన్ కల్యాణ్ చేరదీసినట్టుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

వైసీపీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో జగన్ పక్కన పెట్టేసిన ఆరణి శ్రీనివాసులును ప్రత్యేకంగా తమ పార్టీలోకి తీసుకుని, తిరుపతి ఎమ్మెల్యేగా పవన్ అవకాశం కల్పించడం అనేది కూడా.. కేవలం ధన వనరుల కారణంగానే అని ఇప్పుడు అర్థమవుతోంది. పవన్ కూడా అందరిలాంటి రాజకీయాలే చేశారు.. కానీ వాటికి క్లీన్ పాలిటిక్స్ అనే ముసుగు వేసుకుని ప్రజలను మోసం చేశారు.. అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం రాగానే.. తనకు నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెప్పారని, లక్ష్మి నుంచి తీసుకున్న కోట్ల డబ్బు తిరిగి ఇచ్చేస్తానని కిరణ్ రాయల్ ఫోనులో ఇచ్చిన హామీలను గమనిస్తే.. పవన్ కల్యాణ్ తన పార్టీ వారికి నామినేటెడ్ పదవులను దోచుకోవడం కోసమే కట్టబెడుతున్నట్టుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

31 Replies to “పవన్ లోగుట్టును బయటపెట్టిన కిరణ్ రాయల్!”

  1. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి 20 కోట్లు అవసరం అంటే.. పవన్ కళ్యాణ్ ది తప్పు..

    వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతే.. జగన్ రెడ్డి నివురు గప్పిన నిప్పు..

    వహ్వా.. వహ్వా..

    ..

    అధికారం లో లేకుండానే 21 సీట్లతో 21 సీట్లు గెలిచిన .. పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు..

    సీఎం కుర్చీలో కూర్చుని.. తాను గెలిచిన 11 సీట్లకు.. సీటుకి 36000 కోట్లు జనాల డబ్బు పంచేసిన జగన్ రెడ్డి.. నీతిపరుడు..

    వహ్వా.. వహ్వా..

    ..

    మూడు పెళ్లిళ్లు చేసుకున్న.. పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు..

    అధికారం లోకి వస్తే మగాళ్ల బట్టలిప్పించి చూడాలనుకునే.. జగన్ రెడ్డి సన్మార్గుడు..

    వహ్వా.. వహ్వా..

      1. మరి నీతులు చెప్పేటప్పుడు.. చెక్ చేసుకోవాలి కదా..

        అతి మంచితనం.. అతి నిజాయితీ అని చెప్పుకుంటే.. చెప్పు తో కొట్టాలనిపించదా ..!

  2. ఒరేయ్ రెడ్డి నువ్వు ఇలాంటి బోకు మాటలు ఎన్ని చెప్పినా జనం నమ్మరు. పులివెందులలో ఓటుకి 5000 పంచిన సింగిల్ సింహం గురుంచి మాట్లాడు. నీ కిరస్తాణి రెడ్డి గెలుస్తానో లేదో అని డబ్బులు పంచాడు. So నీతులు చెప్పకు.

  3. ఇంత కన్నా దిగజారావు అనే అనుకుంటే యూ ప్రూవ్డ్ రాంగ్. పెద్ది రెడ్డి కన్న అరాచకాలు ఎవరన్నా చేస్తారా

  4. ఎవడో ఎవరిదగ్గరో కావాలని ఒక్క ఆడదాన్ని వాడుకోవాలని ఏవో మాటలుచెబితే అవి నీకు పవన్కళ్యాణ్ అవినీతి న ఏమి మాట్లాడుతున్నవురా

  5. ఇంతకీ మన అన్నయ్య ఆ చిత్తూరు ticket యెవరికి ఇచ్చాడు GA…..ఆ అతి నిజాయితీ పరుడు యెవరు GA….😂😂 PAWAN KALYAN మీద కడుపు మంట తో ఇలా విషం కక్కడం వల్ల యెవరికి నష్టం GA….ఆలోచించు…FOOD FOR THOUGHT

  6. ఓరి ఎర్రి పుల్కా.. గ్రేట్ ఆంధ్ర ఛానల్ మూసుకోండి.. ఇలాంటి పనికిమాలిన న్యూస్ తప్ప వేరేది లేదా

  7. బట్టలు ఊడదీసే కొరికేంటో, దేవుడా వీడు తేడా గాడని తెలుసు కానీ, మరీ ఇలాంటీ తేడానా. కాసేపేమో వంశీ, గుట్కా నాని, బచ్చా అవినాష్ చాలా బాగుంటారు అంటాడు, లోకేష్, బాబు గారి బట్టలు ఊడదీయ్యాలంటాడు. ఇదెక్కడి దరిద్రంరా బాబూ

Comments are closed.