హోటల్ కు రాని బాకీ!

వరుసగా సినిమాలు తీయడంతో ఇండస్ట్రీలో నమ్మకం పెరిగింది. కానీ ఫ్లాపులు పలకరించడంతో అవి ఏ బిల్లులు అయినా చెల్లింపులు అంతంత మాత్రంగా సాగుతున్నాయని టాక్.

సినిమా ఫంక్షన్లు స్టార్ హోటళ్లలో చేయడం కామన్. వెన్యూ, ఫుడ్, ఒకటి రెండు రూమ్ లు ఇలా వుంటుంది ఖర్చు. సాధారణంగా ముందుగానే వసూలు చేస్తారు. కానీ రెగ్యులర్ కంపెనీ బుకింగ్ లు అంటే వస్తాయిలే అని ఊరుకుంటారు. రాకుండా వుండవు. కాస్త టైమ్ పడుతుంది. కానీ ఓ సినిమా సంస్థ నగరంలోని ఓ మల్టీ నేషనల్ హోటల్ చెయిన్ కు బిల్ చెల్లించకుండా తిప్పలు పెడుతోందట.

వరుసగా సినిమాలు తీయడంతో ఇండస్ట్రీలో నమ్మకం పెరిగింది. కానీ ఫ్లాపులు పలకరించడంతో అవి ఏ బిల్లులు అయినా చెల్లింపులు అంతంత మాత్రంగా సాగుతున్నాయని టాక్. చాలా మంది నటుల బిల్లులు పెండింగ్ వున్నాయి. టెక్నీషియన్ల బిల్లులు పెండింగ్ వున్నాయి. ఆఖరికి సినిమా ఫంక్షన్ చేసిన హోటల్ బిల్లు కూడా పెడింగ్ లో పెట్టారట. ఆ మల్టీ నేషనల్ హోటల్ చెయిన్ మార్కెటింగ్ టీమ్ ఈ బిల్లు వసూలు కోసం నిర్మాత ఆఫీసు చుట్టూ తిరుగుతోందట.

ఇలా అయితే ఇక సినిమా జనాలకు హోటల్ వాళ్లు మొత్తం పేమెంట్ల తీసుకోకుండా ఈవెంట్ చేసుకోనివ్వని రోజులు వచ్చేసాయి. చిన్న సంస్థలకు అలాంటి వెసులుబాటు ఎలాగూ లేదు. ఇప్పుడు ఈ సంస్థ ఇలా చేయడం వల్ల పెద్ద సంస్థలు కూడా ఇబ్బంది పడతాయి. మొత్తం డబ్బు కట్టి ఫంక్షన్ చేసుకోండి అంటారు. బహుశా అందుకే కావచ్చు.

ఇటీవల ఆ మల్టీ నేషనల్ చెయిన్ హోటల్ లో సినిమా ఫంక్షన్ లు తగ్గిపోయాయి. నిజానికి సినిమా వాళ్లు అన్నా, సినిమా ఫంక్షన్ లు అన్నా చాలా డిస్కౌంట్ ఇస్తారు అని ఆ హోటల్ కు పేరు వుంది.

4 Replies to “హోటల్ కు రాని బాకీ!”

Comments are closed.