ఢిల్లీయాత్ర : బాబు సామర్థ్యం ఇవాళ తేలుతుంది!

మిర్చి రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఒక్కరూపాయి అయినా వెచ్చించే ఉద్దేశం చంద్రబాబుకు లేనట్టుగా ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పదవీ స్వీకార ప్రమాణానికి, ఎన్డీయే కూటమిలోని రెండో అతిపెద్ద పార్టీ అధినేతగా ఆయన హాజరవుతారు. గురువారం పూర్తిగా ఢిల్లీలోనే గడుపుతారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి వివిధ అవసరాల నిమిత్తం కేంద్ర మంత్రుల సహకారాన్ని కోరుతారు.

అయితే.. రాష్ట్రంలో మిర్చి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో.. కేంద్రం వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిన తర్వాత.. చంద్రబాబు ఢిల్లీయాత్ర కీలకంగా మారుతోంది. ఢిల్లీ పర్యటన ముగిసేలోగా.. వాడిపోయిన మిర్చి రైతులు మొహాల్లో కాస్త ఊరట నింపే ఆశాజనకమైన ప్రకటనను చంద్రబాబునాయుడు సాధిస్తారా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే వద్ద ఆయన పలుకుబడి, ఆయన వ్యూహచాతుర్యం, సామర్థ్యం ఇవాళ తేలుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మిర్చి రైతుల్ని ఆదుకోవడం గురించి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి తాజాగా కూడా ఒక లేఖ రాసింది. మార్కెట్ జోక్యం పథకం ద్వారా మిర్చి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. అయితే.. ఆ పథకం కింద ఉత్పత్తిలో 25 శాతం పంటకు మాత్రమే సాయం అందిస్తారు. అలాగే.. అందించే సాయంలో సగం రాష్ట్రప్రభుత్వం భరిస్తే మిగిలిన సగం కేంద్రం ఇస్తుంది.

మిర్చి రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఒక్కరూపాయి అయినా వెచ్చించే ఉద్దేశం చంద్రబాబుకు లేనట్టుగా ఉంది. ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రమే మొత్తం సాయం అందించాలని ఆ లేఖలో రాసేశారు. రాష్ట్ర పరిస్థితి నిజమే అయినప్పటికీ.. లేఖలో రాసినట్టుగా కేంద్రంనుంచి మొత్తం నూరుశాతం సాయం సాధించగలిగితే.. చంద్రబాబునాయుడు సమర్థతకు అది నిదర్శనం.

అలాగే.. పండిన ఉత్పత్తిలో 25 శాతానికి మాత్రమే సాయం అనేది నిబంధన కాగా.. దానిని పక్కన పెట్టి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 75 శాతం పంటకు సాయం అందించాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఆ విషయంలో ఆయన కేంద్రాన్ని ఒప్పించగలిగినా కూడా.. గొప్పవిషయమే. మిర్చి రైతులకు ఆయన పెద్ద మేలు చేసిన వారు అవుతారు.

గురువారం నాటి చంద్రబాబు ఢిల్లీ షెడ్యూలులో కేంద్ర జల్ శక్తి మంత్రిని కలిసి పోలవరం కాలువల సామర్థ్యం పెంపు కోసం అదనపు సాయం అడగడం, అలాగే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం, ఆ తరువాత అమిత్ షాను కలిసి రాష్ట్రానికి పలు ప్రాజెక్టుల గురించి చర్చిచండం ఉన్నాయి. అలాగే.. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేదిని కలిసి మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడబోతున్నారు. వ్యవసాయమంత్రికి లేఖలు రాశారు తప్ప.. ఆయనతో భేటీ షెడ్యూలులో లేదు. వీలైతే ఆయనను కూడా కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వీరిలో ఎందరిని కలిసినా, ఏం చేసినా.. ఢిల్లీనుంచి తిరుగు ప్రయాణానికి ముందు పెట్టే ప్రెస్ మీట్ లో ‘కేంద్రానికి మిర్చి రైతుల సమస్యలు వివరించాం.. సావధానంగా విన్నారు.. సానుకూలంగా స్పందించారు’ వంటి పడికట్టు మాటలు కాకుండా.. నిర్దిష్టంగా కేంద్రం ఏం సాయం చేయబోతున్నదో.. ఆశాజనకమైన ఒక్క ప్రకటన అయినా చంద్రబాబు సాధిస్తారేమో వేచిచూడాలి.

9 Replies to “ఢిల్లీయాత్ర : బాబు సామర్థ్యం ఇవాళ తేలుతుంది!”

  1. చంద్రబాబు సామర్ధ్యం తో నిన్న లేఖలో అడిగినవన్నీ సాధించుకొని వచ్చినా..

    తమరి రోత రాత ఒకటే కదా..

    జగన్ రెడ్డి గుంటూరు పర్యటన కారణం గానే నిధులు వచ్చి పడిపోయాయి..

    బీజేపీ వణికిపోయింది.. కేంద్రం హడలిపోయింది.. ఢిల్లీ షేక్ అయిపొయింది .. అందుకే మూడు రోజులు ముందుగానే భూకంపం వచ్చింది..

    వైసీపీ కి లాభం.. టీడీపీ కి నష్టం అంటూ ఎదో ఒక పులిహోర ఆర్టికల్ వండుతావు..

    1. నీకు ఇష్టం లేకపోతే చదవకు-రా అ-య్యా.. ఇక్కడే ఉండి ఎందుకు మిగించుకుంటావు

      1. నా కామెంట్స్ చదవడం నీకు ఇష్టం లేదు.. మరి చదవడం మానేయడం లేదు కదా.. ఏడ్చుకుంటూ చదువుతున్నావు.. చదివి ఏడుస్తున్నావు..

        నీ లంజమీడియా లో కూర్చుని మిమ్మల్నే దెంగడం నాకు ఒక సరదా..

        దెంగించుకోండి..

  2. ఎటు మాడా గాడి సామర్థ్యం గురించి last 5 years చూశామని ప్రజలు చెప్తున్నారు!! బాబు గారు కాపబుల్ అని కూడా ప్రజల నమ్మకం!! you don worry ra ఎంకి!!

  3. డిమాండ్ చూసుకొని పంట వేయమని రైతన్నలకు ఖాళీ గా ఉన్న నేతన్న లు గైడ్ చేస్తే బాగుంటుంది.. ఎంతసేపు రాజకీయాలు, మంది సొమ్ము పంచుడు

Comments are closed.