ఎట్టకేలకూ ఢిల్లీలో సీఎం అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన రోజుల వ్యవధి ఇందుకు తీసుకుంది బీజేపీ. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీజేపీ సీఎం క్యాండిడేట్ ను డిసైడ్ చేయడానికి మాత్రం సమయం తీసుకుంది. ఆసక్తిదాయకమైన రీతిలో తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన రేఖా గుప్తాను బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
తద్వారా ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం లాంఛనంగా మారింది. కాంగ్రెస్ హయాంలో షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు ఏకధాటిగా సీఎంగా కొనసాగారు. ఆప్ హయాంలో కేజ్రీవాల్ సీఎం పీఠం నుంచి వైదొలిగిన దశలో మహిళకు అవకాశం లభించింది. ఇప్పుడు బీజేపీ కూడా మహిళకే అవకాశం ఇచ్చింది.
తొలి సారి ఎమ్మెల్యేగా నెగ్గడంతోనే ఢిల్లీకీ సీఎం కావడం అనేది కూడా ఒక రకమైన సంప్రదాయమే. గతంలో కేజ్రీవాల్ ఇదే ధోరణిలో తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడంతోనే సీఎం అయ్యారు. ఇప్పుడు రేఖా గుప్తాకు ఆ తరహా అవకాశమే దక్కింది.
50 సంవత్సరాల వయసున్న రేఖా గుప్తా ఏబీవీపీ నేపథ్యం నుంచి వచ్చారు. 1990ల నుంచి ఈమె ఏబీవీపీలో క్రియాశీలకంగా ఉండటమే కాకుండా, 1996-97 సంవత్సరాలకు గానూ ఈమె ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా విజయం సాధించారట. ఆ తర్వాత బీజేపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఢిల్లీ మున్సిపాల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
ఇటీవలి ఎన్నికల్లో ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇంతలోనే సీఎం పీఠం దక్కుతుండటం విశేషం. తన రెండేళ్ల వయసులో రేఖా గుప్తా తల్లదండ్రుల వలసతో ఢిల్లీకి వచ్చారట. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఉద్యోగి అట ఆ సమయంలో. హర్యానా నుంచి గుప్తా కుటుంబం ఢిల్లీకి వచ్చిందట. కేజ్రీవాల్ తరహాలో ఢిల్లీకి హర్యానీ మూలాలున్న సీఎం ఎన్నికవుతున్నట్టున్నారు మరోసారి!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు,
S we known