అందరికీ క్షమాపణలు – విశ్వక్ సేన్

లైలా సినిమాకు సంబంధించి ఎట్టకేలకు తన తప్పును అంగీకరించాడు విశ్వక్ సేన్

లైలా సినిమాకు సంబంధించి ఎట్టకేలకు తన తప్పును అంగీకరించాడు విశ్వక్ సేన్. తనపై వచ్చిన ప్రతి నిర్మాణాత్మక విమర్శను అంగీకరిస్తున్నానంటూనే… ఇకపై తన సినిమాల్లో అసభ్యత ఉండదని మాటిస్తున్నాడు.

“ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శల్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను. నా అభిమానులకు, నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ అయినా, మాస్ అయినా అందులో అసభ్యత ఉండదు.”

ఇలా లైలా సినిమాకు సంబంధించి అందరికీ క్షమాపణలు చెప్పాడు విశ్వక్. ఇకపై తను చేసే సినిమాలే కాకుండా, అందులోని ప్రతి సన్నివేశం మనసుకు తాకేలా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

లైలా సినిమా పేరు ప్రస్తావించకుండా, అందరూ చేసిన నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు తెలిపిన విశ్వక్ సేన్, త్వరలోనే మరో బలమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తానంటున్నాడు.

8 Replies to “అందరికీ క్షమాపణలు – విశ్వక్ సేన్”

  1. పబ్లిక్ లో బూతు ఎక్కడున్నా భూస్థాపితం చేద్దాం.

    బూతు లేని సమాజం .. మన నినాదం .

  2. పబ్లిక్ లో బూతు ఎక్కడున్నా భూస్థాపితం చేద్దాం .

    బూతు లేని సమాజం మన నినాదం .

Comments are closed.