ష‌ర్మిల కామెంట్స్‌పై స్పందించేది లేదంటున్న వైసీపీ!

వ్య‌క్తిగ‌తంగా మాట్లాడిన దానికి, తాము అదే విధంగా ఏ ర‌కంగా స‌మాధానం ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల త‌మపై చేసే విమ‌ర్శ‌ల‌కు స్పందించాల‌ని అడ‌గొద్ద‌ని మీడియా ప్ర‌తినిధుల్ని వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ విన్న‌వించారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ జ‌గ‌న్‌కు స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోవ‌డంపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌ల‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌ల్సి బొత్స దృష్టికి తీసుకెళ్లి స్పందించాల‌ని కోరారు.

నేర‌స్తున్ని జైలుకు వెళ్లి ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌కు , వైసీపీ నేత‌ల‌కు ప్ర‌జాస‌మ‌స్య‌ల గురించి మాట్లాడే నైతిక అర్హ‌త లేద‌ని ష‌ర్మిల కామెంట్స్‌పై స్పందించాల‌ని కోర‌గా, బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.

ష‌ర్మిల ఖాళీగా కూచున్నారని ఆయ‌న వ్యంగ్యంగా అన్నారు. ఆవిడ ఏదో మాట్లాడుతుంటే స‌మాధానం చెప్పాలా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో చంద్ర‌బాబు, కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వాల్లో లోపాలేవీ ఆమెకు క‌నిపించ‌వన్నారు. జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త కోపంతో ష‌ర్మిల విమ‌ర్శ‌లు చేస్తున్నారన్నారు.

అందుకే ఆమెకు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదని బొత్స తేల్చి చెప్పారు. ఒక రాజ‌కీయ పార్టీ విధానాల ప‌రంగా మాట్లాడితే, వాటిపై తాము మాట్లాడ్తామ‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా మాట్లాడిన దానికి, తాము అదే విధంగా ఏ ర‌కంగా స‌మాధానం ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కావున ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌పై స్పందించాల‌ని త‌మ‌ను అడ‌గొద్ద‌ని, వాటికి స‌మాధానాలు వుండ‌వ‌ని బొత్స స్ప‌ష్టం చేశారు.

24 Replies to “ష‌ర్మిల కామెంట్స్‌పై స్పందించేది లేదంటున్న వైసీపీ!”

  1. పోలీస్ బట్టలు ఊడదీస్తామని సిగ్గులేకుండా వల్లే రక్షణగా రావాలి అని ఎలా అడుగుతారు., అది కూడా పోలీస్ పర్మిషన్ రిజెక్ట్ చేసిన ప్రోగ్రాం కి

      1. ఎవడు చెక్కగాళ్ళ నిన్నే జగ్గడు చెప్పాడుగా…వంశి , నాని చిక్కగా ఉంటారంటే…పాపం జఫ్ఫా గళ్ళు అంత చెక్కగాళ్ళని అన్న ఫీలింగ్ అనుకుంట

      2. ఎవడు చె క్కగాళ్ళ నిన్నే జగ్గడు చెప్పాడుగా…వంశి , నాని చిక్కగా ఉంటారంటే…పాపం జ ఫ్ఫా గళ్ళు అంత చెక్కగాళ్ళని అన్న ఫీలింగ్ అనుకుంట

  2. మీరు ఏ మే మన్నారో

    వారేం విన్నారో

    భాషంటూ లేని భావాలేవో

    మీ చూపులో చదివారు

  3. గతం లో ఈయన పీసీసీ అధ్యక్షుడు .. ఆవిడా ప్రస్తుత అద్యక్ష్యురాలు .. తారుమారు తక్కెరమరు అయ్యారు ..

  4. అసలే ఒక పక్క తండ్రి వారసత్వం మహిళలుకు ఇవ్వడం లేదు అని, చిరంజీవి గారి మీద లేకి articles రాయిస్తు …..మళ్లీ మీరే ఇలా Shellemma ని అవమానానించడం Correct కాదు GA…ఇది అన్యాయం 😂😂😂

  5. అసలు బొత్స నే బిజీ గా ఉన్నారు తన వాళ్ళని జనసేన లోకి పంపేదానికి… మధ్యలో మీ గోల ఏందీ…

    1. ఆవేశపడి తిట్టబాకండి.. లోపల సంధి ప్రయత్నలు జరుగుతున్నాయి.. మళ్ళా జేజేలు కొట్టాల్సి వచ్చిన రావచ్చు

Comments are closed.