ఆ నీచున్ని అరెస్ట్ చేయాల్సిందే!

ఆ నీచున్ని అరెస్ట్ చేయాల‌ని జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలు ల‌క్ష్మి పోలీసులకు మ‌రోసారి ఫిర్యాదు చేశారు.

ఆ నీచున్ని అరెస్ట్ చేయాల‌ని జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలు ల‌క్ష్మి పోలీసులకు మ‌రోసారి ఫిర్యాదు చేశారు. తిరుప‌తి ఎస్పీ కార్యాల‌యంలో ఈ మేర‌కు ఆమె గురువారం ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. హైకోర్టులో ఉప‌శ‌మ‌నం దొరికింద‌న్న స‌ద‌రు జ‌న‌సేన నాయ‌కుడు కిర‌ణ్‌రాయ‌ల్ ప్ర‌చారం చేసుకుంటున్న నేప‌థ్యంలో బాధితురాలు జిల్లా పోలీస్‌బాస్ కార్యాల‌యాన్ని ఆశ్రయించ‌డం విశేషం.

త‌న‌కు ప్రాణ‌హాని వుంద‌ని, కుటుంబ స‌భ్యుల‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్న‌ట్టు ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని, వెంట‌నే అత‌న్ని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. త‌న ప్రాణాల‌కు హాని క‌లిగిస్తామంటున్న కిర‌ణ్‌పై చీటింగ్ కేసు మాత్ర‌మే న‌మోదు చేశార‌ని, త‌న‌ను బెదిరించి, చంపేస్తామ‌న్న హెచ్చ‌రిక‌ల‌కు త‌గ్గ‌ట్టు సెక్ష‌న్లు కేసులో లేవ‌ని ఆమె ఆరోపించారు. కిర‌ణ్‌రాయ‌ల్ లాంటి నీచున్ని అరెస్ట్ చేసి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోర‌డం మ‌రోసారి కేసుపై చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రోవైపు కిర‌ణ్‌రాయ‌ల్ అధినేత‌ను బ్లాక్ మెయిల్ చేసి, పార్టీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోకుండా జాగ్ర‌త్త ప‌డ్డార‌నే అభిప్రాయాన్ని తిరుప‌తి జ‌న‌సేన నాయ‌కులు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. బాధితురాలికి న్యాయం జ‌ర‌గ‌క‌పోతే, పార్టీకి రాజ‌కీయంగా న‌ష్ట‌మ‌వుతుంద‌ని తిరుప‌తి లోకల్ లీడ‌ర్స్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

13 Replies to “ఆ నీచున్ని అరెస్ట్ చేయాల్సిందే!”

Comments are closed.