ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ కాస్త… ఫైర్‌నెట్ చైర్మన్ అవతారం ఎత్తారు. ఏపీ ఫైబర్‌నెట్‌ను దివాలా వైపు నడిపిస్తున్నారని, తాను వుండాలా? లేదా? అనేది తేలిపోవాల్సిందే అని ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీరెడ్డి మీడియా ముఖంగా తేల్చి చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. మీడియాతో ఆయన మాట్లాడుతూ తన సంస్థ ఎండీ దినేష్‌కుమార్‌తో పాటు మరికొందరు ఉద్యోగులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గత ఏడాది డిసెంబర్ 24న మీడియా సమావేశంలో 410 మంది ఇర్రెగ్యులర్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు చెప్పానన్నారు. అయితే ఇంత వరకూ తన ఆదేశాలు అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పిన తర్వాత కూడా తొలగించకపోవడంతో పాటు ఊరికే కూచోపెట్టి జీతాలు ఇస్తున్నారని ఎవరైనా వార్తా కథనాలు రాస్తారనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు కోటిన్నర రూపాయిలు జీతాల రూపంలో ఊరికే ఇవ్వాల్సి వస్తోందన్నారు. తాను ఆదేశించిన తర్వాత కూడా వాళ్లను తప్పిస్తూ, ఉత్తర్వులు ఇవ్వడానికి ఎండీ దినేష్‌కు భయం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను చైర్మన్‌గా పని చేయగలగమా? లేక వెళ్లిపోవడమా? ఏదో ఒకటి జరగాలని ఆయన స్పష్టం చేశారు.
ఫైబర్‌నెట్ సంస్థ దివాలా అంచున ఉన్నట్టు ఆయన వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల్లో అన్ని శాఖల్లో అభివృద్ధి కనిపిస్తోందన్నారు. కానీ పురోగతి లేని ఏకైక సంస్థ ఏదైనా వుందంటే.. ఫైబర్‌నెట్ మాత్రమే అని ఆయన మండిపడ్డారు. గతంతో పోల్చితే కనీసం ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు. అంతేకాదు, తొమ్మిది నెలల కూటమి పాలనలో ఒక్కంటే, ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదన్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
ఫైబర్‌నెట్ ఎండీ, ఐఏఎస్ అధికారి అయిన దినేష్‌కుమార్ ఒక్కరోజు కూడా నెట్‌వర్క్‌ను పెంచే ప్రయత్నమే చేయలేదని విమర్శించారు. అలాంటప్పుడు కనెక్షన్లు ఎలా పెరుగుతాయని ఆయన నిలదీశారు. గత మేనేజ్‌మెంట్‌తో కలిసి ఏమైనా కుట్ర ఉందని అనుకోవాలేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇదేంటి దినేష్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు ఉదయం 10:45 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతే ఎలా? కనీసం ఓనర్ షిప్ తీసుకోరా అని జీవీరెడ్డి ప్రశ్నించారు. వ్యాపారాన్ని ఒక్క అడుగుకూడా ముందుకు సాగకుండా ముగ్గురు వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్యరామ్ భరద్వాజ్, బిజినెస్ అడ్వైజర్ సురేష్, ప్రొక్యూర్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్‌లను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు ఏం చేసినా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
వ్యూహం సినిమా విషయంలో నోటీసు ఇస్తే నేటికీ సమాధానం లేదన్నారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగితే తనకు చూపించరా అని జీవీరెడ్డి ప్రశ్నించారు. శవాలపై పేలాలు ఏరుకోవాలని అధికారులు చూస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రూ.2000 కోట్లు టర్నోవర్ చేయదగ్గ సంస్థ ఇది అని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్‌కు ఉద్యోగులు ద్రోహం చేస్తున్నారని ఆయన కొన్ని పోలికలతో చెప్పడం గమనార్హం. ప్రజలు కట్టే పన్నుఅంటే లెక్కలేనితనం కనిపిస్తోందని మండిపడ్డారు. ఫైబర్‌నెట్ అధికారులు ఒళ్లు బద్ధకంతో కోర్టు వాయిదాలకు వెళ్లకుండా రూ.337 కోట్లు జరిమానా పడేందుకు కారణమయ్యారని విమర్శించారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వకుండా అధికారులు ఎవరిని కాపాడాలని అనుకుంటున్నారని ఆయన నిలదీశారు.
అయన చెప్పిన వన్ని క్రితం ప్రభుత్వం లొని నిర్వాహకాలె! Y.-.C.-..P హయాముల్లొ పని కట్టుకు బ్రస్టు పట్టించారు! ఇప్పుడు బాగు చెద్దం అన్నా వెగంగా పనులు అవ్వటం లెదు అని అయన చెప్పింది!
Abba 9 months avuthundi Inka gatha orabutvyam Valle anadaniki konchamanna **** undali… Pethanalu,pampakala kosam jarige portam idhi…gatha prabutyam lo levu kabatti koncham time paduthundi chetulu maradaniki
greatandhra.com/politics/andhra-news/officers-still-in-ycp-hangover-says-fibernet-chairman-144235
ఇదొక పనికి మాలిన సంస్థ … ప్రభుత్వం ఇటువంటి వాటిలో దిగకూడదు .. ప్రైవేట్ వాళ్లని చేసుకోనిచ్చి వాళ్లకు కావలసిన అనుమతులు ఇచ్చి ఒక నాలుగు ఐదు కంపెనీలు ఉండి వాటి మధ్య పోటీ వల్ల రేట్లు న్యాయంగా వుండేట్టు చేస్తే చాలు
నిజమె! పంచుకుంటూ వెళ్తె చాలు
Me eastam sir
9 నెలలు అయినది బాక్సులు లేక మరి సంస్థ ఎలా బాగపడుతుంది.
బాక్స్ లు అని మార్కెటింగ్ మేనేజర్ ను అడుగుతే పై నుంచి రావడం లేదు అంటున్నారు. ముందు బాక్సులు ఆపరేటర్లకు ఇస్తే కదా కనెక్షన్లు పెరిగేది
ముందు బాక్సలు ఇవ్వండి సార్. ఆటోమేటిక్ గా కనెక్షన్లు పెరుగుతాయి.
ఊన్న కనెక్షన్లు కే నెట్ సరింగా రావడలేదు. మరి కొత్త కనెక్షన్లు ఎలా వస్తాయి సార్
There are other qualified and well deserving candidates from Janasena. These red lafuts are inefficient and just waste time. Remove him and we will nominate someone from Janasena.
There are other qualified and well deserving candidates from Janasena. These reds are inefficient and just waste time. Remove him and we will nominate someone from Janasena.
Chethakani ee jeddy gaadiki enduku sir ilanti important posts. Many deserving candidates are in Janasena. Replace him with someone from Janasena immediately. We will show how systems should be put in place.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
సాక్షి మీడియా కి దాస్యం చేసే వాళ్ళు ఆ దినేష్ లాంటి వాళ్ళు.
ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటూ ప్రైవేటు వాళ్ళపెంట తినే జాతి.