ఇంటి అద్దె నెలకు రూ.24 లక్షలు

ముంబయిలోని పాలీ హిల్ ప్రాంతంలో 2 లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. వీటిని షారూక్ ఖాన్ అద్దెకు తీసుకున్నాడు.

నెలకు 24 లక్షల రూపాయలు అద్దె ఎవరైనా కడతారా? అసలు అంత ఖరీదైన ఇళ్లు ఇండియాలో ఉన్నాయా? అలాంటి డౌట్స్ అక్కర్లేదు. ముంబయిలో అలాంటి ఇళ్లున్నాయి. వాటికి నెలకు 24 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నాడు హీరో షారూక్ ఖాన్.

ముంబయిలోని పాలీ హిల్ ప్రాంతంలో 2 లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. వీటిని షారూక్ ఖాన్ అద్దెకు తీసుకున్నాడు. ఏడాదికి 2 కోట్ల 90 లక్షల రూపాయలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే, నెలకు అటుఇటుగా 24 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నాడన్నమాట.

ఇంతకీ ఈ లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్స్ ఎవరివో తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీకి చెందిన ప్రాపర్టీస్ ఇవి. ఇతడి నుంచి పైన చెప్పిన భారీ మొత్తానికి షారూక్ ఖాన్ వీటిని లీజుకు తీసుకున్నాడు.

నిజానికి షారూక్ ఖాన్ కు ముంబయిలో భారీ నివాసం ఉంది. అతడు తన భార్యాపిల్లలతో కలిసి అందులోనే ఉంటున్నాడు. కానీ ‘అదనపు అవసరాల’ కోసం ఈ రెండు లగ్జరీ డ్యూప్లెక్స్ ఫ్లాట్స్ ను అతడు అద్దెకు తీసుకున్నాడు. ఈ డీల్ వెనక ఆదాయపు పన్ను లెక్కలు, వ్యవహారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

4 Replies to “ఇంటి అద్దె నెలకు రూ.24 లక్షలు”

Comments are closed.