అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోతున్నావా పవన్?

వేదికపై ఉన్న పెద్దలందర్నీ పలకరిస్తూ ముందుకెళ్లిన ప్రధాని మోదీ, పవన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాసేపు ఆగారు. పవన్ పై జోక్ వేశారు

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈమధ్య పూర్తిగా కాషాయం టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడు చూసినా కాషాయంలో కనిపిస్తూ, ఏదో ఒక దీక్ష చేస్తున్నారు.

మొన్నటికిమొన్న కాషాయ వస్త్రాలు ధరించి, షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర చేశారు. ఆ యాత్ర పూర్తయినా, ఆయన వేషధారణ మాత్రం ఇంకా మారలేదు. అదే గెటప్ లో ఈరోజు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు పవన్ కల్యాణ్.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్, వేదికపై ప్రధాని మోదీని కలుసుకున్నారు. పవన్ ను చూసిన వెంటనే మోదీ పంచ్ వేశారు. ఆయన వేషధారణ చూసి… “అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోతున్నారా ఏంటి?” అంటూ జోక్ చేశారు.

ప్రధాని జోక్ కు పవన్ ముసిముసిగా నవ్వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకొచ్చి, తానే మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.

వేదికపై ఉన్న పెద్దలందర్నీ పలకరిస్తూ ముందుకెళ్లిన ప్రధాని మోదీ, పవన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాసేపు ఆగారు. పవన్ పై జోక్ వేశారు. “పవన్ కల్యాణ్ స్థాయి ఇది” అంటూ ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

21 Replies to “అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోతున్నావా పవన్?”

  1. Veedu desatana chesthunnadi cbn gaadu poga pettadu ani..anthe gaani desanni uddariddamani kaadu..

    intlo unte Russia poga bayata unte cbn gaadi poga ..

    ekkadiki pothadu papam kerala , Himalayas ani povadame

  2. తన నాలుగో A1 పెళ్ళాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే అది బట్టలుడదీసి ఏమేమో చేసి చీకి పారేసింది.. ఏం చేస్తాడు మరి

  3. రంగులో పరమార్థం అంతా వేరులే..

    కాషాయం ఎందుకో తెలియకనే ఆడిగెరా పీఎం..మీడియా సోది….పార్టీని ఎంత గట్టిగా రాసుకుంటే అంత టీడీప్ కి సాయం అందించొచ్చు….

Comments are closed.