నేను చాలా సాధారణ వ్యక్తిని – బన్నీ

తనను తాను చాలా సాధారణ వ్యక్తిగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. తను వంద శాతం కామన్ మేన్ అని అంటున్నాడు.

తనను తాను చాలా సాధారణ వ్యక్తిగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. తను వంద శాతం కామన్ మేన్ అని అంటున్నాడు. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఓ సాధారణ వ్యక్తిగా/ప్రేక్షకుడిగా ఉంటానని అన్నాడు. ఇక సినిమా షూటింగ్స్ లేనప్పుడు మరింత నార్మల్ గా ఉంటానని అంటున్నాడు.

షూటింగ్స్ లేనప్పుడు బన్నీ ఏమీ చేయడంట. కనీసం పుస్తకం కూడా చదవడంట. అలా ఏమీ చేయకుండా ఉండడమే తనకు ఇష్టం అంటున్నాడు ఈ హీరో. పుష్ప-2తో భారత్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ నటుడు, తనకు ఎలాంటి గర్వం ఉండదని, అది తన మనసులో పుట్టుకతో ఉందని, దాన్ని ఎవ్వరూ తొలిగించలేరని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో ఎన్ని విజయాలు సాధించినా నిజజీవితంలో సింపుల్ గా ఉండడమే తనకు ఇష్టమని ప్రకటించాడు.

అమెరికాలోని ప్రముఖ సినీ మ్యాగజైన్స్ లో ఒకటి ‘ది హాలీవుడ్ రిపోర్టర్’. ఇది తన ఇండియన్ ఎడిషన్ ను ప్రారంభించింది. ప్రారంభ సంచికలో కవర్ పేజీపైకి అల్లు అర్జున్ ను ఎక్కించింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇండియా ఎడిషన్ తొలి సంచిక కవర్ పేజీపై తన ఫొటో ముద్రించడాన్ని గౌరవంగా ఫీలయ్యాడు బన్నీ. ఈ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో పై విధంగా స్పందించాడు. కవర్ పేజీలో అల్లు అర్జున్ సింపుల్ గా కనిపించాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ తో అతడు ఓ సినిమా చేయబోతున్నాడు. మరోవైపు దర్శకుడు అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నాడు.

7 Replies to “నేను చాలా సాధారణ వ్యక్తిని – బన్నీ”

Comments are closed.