గ్యారెంటీ లేదు గురూ!

క‌ర్నూలుకు హైకోర్టు బెంచ్ వ‌స్తుంద‌నే విష‌య‌మై గ్యారెంటీ లేదు. బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్‌తో ఇలాంటి చ‌ర్చ‌కు తెర‌లేచింది.

క‌ర్నూలుకు హైకోర్టు బెంచ్ వ‌స్తుంద‌నే విష‌య‌మై గ్యారెంటీ లేదు. బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్‌తో ఇలాంటి చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌ర్నూలులో హైకోర్టు శాశ్వ‌త బెంచ్ ఏర్పాటు చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో మ‌రోసారి చంద్ర‌బాబు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై పున‌రుద్ఘాటించారు. దీంతో క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటే త‌రువాయి అని అంతా అనుకున్నారు.

అయితే ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హామీతో త‌మ‌కు సంబంధం లేద‌ని ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తో కూడిన ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది. క‌ర్నూలులో బెంచ్ శాశ్వ‌త ఏర్పాటుకు సంబంధించిన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టు ధ‌ర్మాస‌నం సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం న్యాయ‌మూర్తుల క‌మిటీ బెంచ్ ఏర్పాటుపై అధ్య‌య‌నం చేస్తోందని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఆ క‌మిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో తెలియ‌ద‌ని చెప్పింది.

కానీ క‌ర్నూలులో శాశ్వ‌త హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ సీఎం రాసిన లేఖ‌కు తామేమీ క‌ట్టుబ‌డి వుండాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింది. బెంచ్ ఏర్పాటుపై ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యానికి తాము బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. న్యాయ వ్య‌వ‌స్థ స్వ‌తంత్ర‌త విష‌యంలో ఎవ‌రూ జోక్యం చేసుకోలేర‌ని ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది.

ఇత‌రుల జోక్యాన్ని తాము ఎంత‌మాత్రం అనుమ‌తించ‌బోమ‌నే అర్థం ధ్వ‌నించేలా చీఫ్ జ‌స్టిస్‌తో కూడిన ధ‌ర్మాస‌నం త‌మ వైఖ‌రిని స్ప‌ష్ట‌ప‌ర‌చ‌డం విశేషం. దీంతో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అంశం, ఆ వ్య‌వ‌స్థ చేతిలో వుందే త‌ప్ప‌, ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం కాద‌ని స్ప‌ష్ట‌మైంది. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే నాయ‌కులు హామీలు ఇచ్చార‌ని స్ప‌ష్ట‌మైంది.

7 Replies to “గ్యారెంటీ లేదు గురూ!”

  1. బెంచ్ కె దిక్కు లేదు అంటే అన్న చెప్పిన న్యాయ రాజధాని అంతా గాలి కబుర్లే అనే ప్రూఫ్ అయిందిగా

  2. మా అన్నయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు న్యాయ రాజధానిగా తీసుకున్న నిర్ణయాన్ని హర్షించిందని రాస్తే పోయేది కదా

Comments are closed.