సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు

తెలివైన గురువు తన కొడుకును తన దగ్గరే ఉంచుకోడు. ప్రపంచాన్ని చూసి రమ్మని పంపిస్తాడు. దర్శకుడు త్రివిక్రమ్ అదే చేస్తున్నారు.

తెలివైన గురువు తన కొడుకును తన దగ్గరే ఉంచుకోడు. ప్రపంచాన్ని చూసి రమ్మని పంపిస్తాడు. దర్శకుడు త్రివిక్రమ్ అదే చేస్తున్నారు. నిజానికి దర్శకుడి కన్నా త్రివిక్రమ్ కు రైటర్ గానే ఎక్కువ పేరు. ఆయన మాటల మాంత్రికుడే తప్ప తీతల తాంత్రికుడు కాదు. పైగా ఆయన తీసిన ప్రతి సీన్ ఎక్కడో అక్కడ నుంచి కాపీ కొట్టేసినట్లు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు వెలికి తీస్తూనే వుంటుంది.

అత్తారింటికి దారేదిలోని కారులో హీరోయిన్లు దుస్తులు మార్చుకునే సీన్ ను కూడా హాలీవుడ్ నుంచి కాపీ కొట్టేసారని ఇటీవలే బయటకు తీసారు. అలాంటి త్రివిక్రమ్ కుమారుడు కూడా దర్శకుడిగా మారుతున్నారు. అందుకోసం ట్రెయినింగ్ అవుతున్నారు.

త్రివిక్రమ్ లాంటి పెద్ద వాళ్లు తలుచుకుంటే వాళ్ల పిల్లలకు అవకాశాలకు లోటు వుండదు కదా. అందుకే తన దగ్గర కొన్నాళ్లు వుంచుకుని, తిన్నగా గౌతమ్ తిన్ననూరి దగ్గరకు పంపించారు. విజయ్- గౌతమ్ తిన్ననూరి సినిమాకు అసిస్టెంట్‌గా వర్క్ చేసారు త్రివిక్రమ్ కుమారుడు. దాదాపు అది పూర్తి కావస్తోంది.

దాని తరువాత ఈసారి ట్రయినింగ్‌కు సందీప్ వంగా దగ్గరకు పంపిస్తున్నారు. అసిస్టెంట్ గా వస్తా అని అనామకుడు అంటే నో అంటారేమో కానీ త్రివిక్రమ్ ఫోన్ చేసి, తన కొడుకును అసిస్టెంట్ గా తీసుకో అంటే వద్దంటారా? అందుకే స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేయబోతున్నారు త్రివిక్రమ్ కొడుకు.

అలా అని ఆ తరువాత సుకుమార్ దగ్గరకో, రాజమౌళి దగ్గరకో పంపించకపోవచ్చు. అది వేరే సంగతి. త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాకు వర్క్ చేసే అవకాశం వుంది.

మరో ఏడాది, రెండేళ్లలో త్రివిక్రమ్ కుమారుడు కూడా మెగాఫోన్ పడతారు. అది పవన్ కొడుకు అకీరాతో ఆయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే పవన్-త్రివిక్రమ్ స్నేహ బంధం అలాంటిది.

5 Replies to “సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు”

    1. Directors kodukulu directors avochu…..talent untene survive avutadu.. heroes laga ruddatam undadu..asalu competition ni encourage chesedi ante oka director lake…kotta vallani encourage chestaru…tappaduga…

Comments are closed.