లైలా విడుదలకు ముందు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆ సినిమాను చెడుగుడు ఆడుకున్నారు. సినిమా వేదికపై నటుడు పృధ్వీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా “బాయ్ కాట్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్ ను జోరుగా ట్రెండ్ చేశారు.
లైలా రిలీజైంది. మొదటి రోజే డిజాస్టర్ అయింది. దీంతో “బాయ్ కాట్ లైలా”, “డిజాస్టర్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సంగతి పక్కనపెడితే, లైలా సినిమాకు సంబంధించిన ఓ క్లిప్ బయటకు రాకుండా పోయింది.
తన ప్రతి సినిమాకు సీక్వెల్ గురించి ప్రకటన చేయడం విశ్వక్ కు అలవాటు. లైలా సినిమాకు కూడా అదే చేశాడు. సినిమా సీక్వెల్ కు పనికొచ్చే మంచి క్లిప్ ఉందని… కాకపోతే ఆ క్లిప్ ను యాడ్ చేయలేదని… సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే, సెకెండ్ వీక్ లో ఆ సన్నివేశాన్ని యాడ్ చేస్తామని ప్రకటించాడు.
లైలా సినిమా రెండో వారంలోకి అడుగుపెడుతోంది. కానీ ఆ క్లిప్ ను యాడ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమా ఘోర పరాజయం పాలైంది. తెగించి క్లిప్ యాడ్ చేసినా థియేటర్లకు జనం వెళ్లలేని పరిస్థితి. అలా విశ్వక్ సేన్ గొప్పగా చెప్పిన ఆ క్లిప్, వెలుగులోకి రాకుండా పోయింది.
లైలా సినిమా రిజల్ట్ చూసిన తర్వాత విశ్వక్ సేన్ తో పాటు టోటల్ యూనిట్ అంతా ఆ సినిమాను పక్కనపడేసింది. రెండో రోజు నుంచే ప్రచారం ఆపేసింది. ప్రస్తుతం విశ్వక్, తన ఫోకస్ మొత్తం ఫంకీ సినిమాపై పెట్టాడు.
Rakapovadami manchidi
Call me
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,