వంశీ కేసులో ఊహించిన‌ట్టే…!

వంశీ దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను హైకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్ర‌యించాల‌ని హైకోర్టు సూచించ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ సీనియ‌ర్ నేత‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బెయిల్ విష‌యంలో చాలా మంది ఊహించిన‌ట్టే జ‌రిగింది. ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వ‌డానికి ఏపీ హైకోర్టు నిరాక‌రించింది. గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీ 71వ నిందితుడు. ఈ కేసులో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వంశీకి ముంద‌స్తు బెయిల్ ద‌క్కింది. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేసిన ద‌ళిత యువ‌కుడు స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను వంశీ కిడ్నాప్ చేశార‌ని పోలీసులు కేసు న‌మోదు చేశారు. మొద‌ట త‌న ఫిర్యాదును స‌త్య‌వ‌ర్ధ‌న్ వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు జ‌డ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కానీ స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను కిడ్నాప్ చేసి, ప్ర‌లోభ పెట్టి, భ‌య‌పెట్ట‌డం వ‌ల్లే ఫిర్యాదు వెన‌క్కి తీసుకున్న వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో వంశీని అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు.

ఒక‌వైపు వంశీ ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, మ‌రోవైపు పోలీసులు మాత్రం విచార‌ణ నిమిత్తం 10 రోజులు క‌స్ట‌డీకి అడిగారు. దీంతో వంశీకి బెయిల్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని న్యాయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టే, ఇవాళ ఆయ‌న‌కు చుక్కెదురైంది. వంశీ దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను హైకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్ర‌యించాల‌ని హైకోర్టు సూచించ‌డం గ‌మ‌నార్హం.

15 Replies to “వంశీ కేసులో ఊహించిన‌ట్టే…!”

  1. అపూర్వమైన గౌరవం, ఆదరణ ఉన్న చోటు వదిలి తాత్కాలిక ప్రయోజనాల కోసం పరాయి పంచన చేరి ఒక నేరస్థుడికి ఊడిగం చేస్తూ సమాజంలో గౌరవం కోల్పోయి, స్వంత సామాజిక వర్గం ఈసడించుకుని నేడు జైలు పాలయ్యాడు….నాయకుడు పట్టించుకోవటం లేదు అన్న అపవాదు రాకుండా చూసుకోవడానికి కంటితుడుపు పరామర్శ తప్ప ఎటువంటి ఓదార్పు లభించదని అర్ధమయ్యింది. జీవితం నాశనం కావటానికి మొదటి అడుగు వేయించిన గడ్డంగాడు నా బతుకే బస్టాండ్ అయ్యింది అని వాపోతున్న నేపధ్యంలో…. అసలు వీడు ఆ గడ్డంగాడు, ఆ నత్తి నాకొడుకు వలనే పార్టీ ఓటమి పాలయింది…ఇక వాళ్ళని వదిలేయండి అని నాయకుడిపై వత్తిడి… ఛీ ఏం బతుకురా నాయన.

  2. రెంటికీ చెడ్డ రేవడి చందాన వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ బతుకు

    1. ఇక వీళ్ళ ముగ్గురుని వదిలించుకుందామని జగన్ పై వైసీపీ శ్రేణుల వత్తిడి.

    2. తమకు గౌరవం లభించే చోటు వదిలి పరాయి పంచన చేరి 2 వైపుల నుంచి ఛీ కొట్టించుకుంటున్న ఆ ముగ్గురు.

      1. వంశీ ,నాని కనీసం ఎంతో కొంత రాజకీయ జీవితం చలాయించారు.అవినాష్ పొలిటికల్ లైఫ్ స్టార్ట్ కాకుండానే క్లోజ్ అయ్యింది. వంశీ ని అవినాష్ ని మొగ్గ కుడిపించింది కొడాలి గాడే.దగ్గరుండి వైసీపీ లో జాయిన్ చేపించాడు.

  3. అందరూ షాక్ అనుకుంటుంటె.. అబ్బె ఎమిలెదు, అది చిన్న విషయమె అనీ చెప్పటానికి తంటాలు పడుతున్నాడు!

  4. ముందు ఇచ్చిన స్టేట్మెంట్ కే విలువ ఉంటుంది : గుడివాడ నాని

    బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Comments are closed.