జ‌గ‌న్ భ‌ద్ర‌త‌పై చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్!

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నా దానిని ఉల్లంఘించి తనకు భద్రత కల్పించలేదని అంటున్నాడని.. జగన్ లాంటి రాజకీయ నాయకుని ఇప్పటివరకు చూడలేదని కామెంట్స్ చేశారు.

కోడ్ ఉన్నందున రావడానికి వీల్లేదని పోలీసులు చెప్పిన మిర్చి యార్డు వెళ్లి రాజకీయాలు చేశారని.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగన్ రాజకీయాలు చేయలని హితవు పలికారు. అలాగే మిర్చి రైతులను అదుకుంటామని, ఎవరు ఆందోళన చెందొద్దని.. మిర్చికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతోనే రైతులకు నష్టం జరుగుతోందని.. రైతులను ఎలా అదుకోవాలో కొన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచామ‌ని సీఎం మీడియాకు చెప్పారు.

కాగా, విజయవాడలో ఓ మ్యూజిక్ షో కోసం సీఎం, డీసీఎం, మంత్రులు అందరూ హాజరైనప్పుడు ఎన్నికల కోడ్ లేదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. నిన్న మిర్చి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని వైసీపీ ఆరోపిస్తూ.. ఇవాళ గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. అలాగే జగన్‌కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటూ వైసీపీ పార్లమెంటరీ పక్షనేత మిథున్ రెడ్డి కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.

ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ చూసిన వైసీపీ నేతలపై రెడ్‌బుక్ ప్రయోగించి దాడులు, అరెస్టులు చేస్తున్నారనే ప్రధాన ఆరోపణ వైసీపీ నుండి వస్తోంది. ఇప్పుడు చివరికి మాజీ సీఎం జగన్‌కు కూడా సరైన భద్రత కల్పించలేదని వైసీపీ అంటోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం పట్టించుకోకపోయినా కేంద్రం అయిన భద్రత కల్పిస్తుందని నమ్మకంతో వైసీపీ ఉంది. చంద్రబాబుకు బయపడి కేంద్రం జగన్‌కు భద్రత కల్పిస్తుందా అనే అనుమానం కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

 

27 Replies to “జ‌గ‌న్ భ‌ద్ర‌త‌పై చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్!”

    1. loki gadu kali ga unnadanta. vadiki call chesi nee marketing chesukora. Vaadi kante nee paniki value undhira. at least you live on your own, but they are living on people shi tt

  1. Rey రేయ్ నిశానీ వెధవల్లారా – ఒక ప్రవైట్ కార్యక్రమానికి హాజరు అవ్వడం , ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద ఆందోళన చేయడం ఒకటేనా ..??

  2. Where was code when musical event was conducted under police protection? Also, how many days would you repeat the same statement that you have not seen a politician like Jagan in your life. It is becoming a laughing stock.

    1. Edhi private and edhi public ikkada. Chemba ekkada kelthe adhi public avuddi. Chemba gadi matalu vinte, edhanna chepthadu. Vaadu code unnapudu polavarm vellaledha, tirupathiki vellaledha

  3. అంటే ఇప్పుడు SYMPATHY డ్రామా కోసం…..🙏🙏🙏…వద్దు GA…..తొందర పడకండి….ELECTIONS కి ఇంకా చాలా time వుంది…🙏🙏

  4. కోన్ని కోన్ని విచిత్రమైన ప్రాణులు వుంటాయి… ఎప్పుడు ఎక్కడ ఏ ఏ నిబంధనలు ఏ ఏ కార్యక్రమాలకు అమలు అవుతాయి తెలియక వుంటాయి..

Comments are closed.