కొందరు టెక్నీషియన్లు ఉంటారు. కాలానికి ఆవల నిల్చుండిపోతారు. అప్ డేట్ కావడం అంటే మంచి కాంబినేషన్లు సెట్ చేసుకోవడం అనుకుంటారు. ఈ తరం జనాలకు నచ్చే కొత్త తరహా కథ, కథనాలు, చిత్రీకరణ అనుకోరు. తమకు వచ్చిన కథలనే తిప్పి తిప్పి వండి వారుస్తుంటారు. దాంతో ఎక్కడో ఒక చోట కెరీర్ కు బ్రేక్ పడిపోతుంది. మారుతున్న కాలాన్ని గమనించిన హీరోలు వాళ్లను పక్కన పెట్టేస్తారు. దాంతో ఇక గ్యాసిప్ లు వండించుకుంటూ వార్తల్లో గడిపేస్తుంటారు.
దర్శకుడు పూరి జగన్నాధ్ మంచి ఫైర్ ఉన్న దర్శకుడు. మాటల తూటాలు పేలుస్తారు. యూత్ కు నచ్చే ఆటిట్యూడ్ పాత్రలను సృష్టిస్తారు. ఇదంతా ఒకప్పుడు. అదే తరహా పాత్రలు, మాటలు, కథలు జనాలకు బోర్ కొట్టేసాయి. కానీ ఆయన కొత్తగా ఆలోచించడం లేదు. కొత్త కథలు రాయడం పక్కన పెడితే, కొత్త తరహా సినిమా అనేది ఆందించలేకపోతున్నారు. దాంతో సినిమాను కొనుక్కున్నవారు కోట్లకు కోట్లు నష్టపోయి కుదేలయిపోతున్నారు. ఆయన బాగానే ఉంటున్నారు. అందుకే హీరోల డేట్ లు దొరకడం అసాధ్యం అయిపోతోంది.
ఇప్పుడు వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే గోపీచంద్ హీరోగా సినిమా చేస్తారని. అది కూడా కొత్త కథ కాదు.. గతంలో చేసిన దానికి సీక్వెల్ అంటూ. అసలు గోపీచంద్ కే హిట్ అన్నది వచ్చి ఎన్ని.. ఎన్ని ఏళ్లయిందో. ఎంత మంది నిర్మాతలు గుల్లయిపోయారో. ఎంత మంది బయ్యర్లు కుదేలయిపోయారో. అలాంటి ఇద్దరి కాంబినేషన్ అంటే వార్తల్లో ఉంటుంది తప్ప వాస్తవ రూపం దాల్చడం అంత వీజీ కాదు.
దర్శకుడు హరీష్ శంకర్ ఎంటర్ టైన్ మెంట్‌కు కేరాఫ్ అడ్రస్. గబ్బర్ సింగ్ అనే సినిమా ఆయనకు లాండ్ మార్క్. తరువాత గద్దలకొండ గణేష్ మరో విజిటింగ్ కార్డ్. కానీ ఈ రెండింటినీ పక్కన పడేలా చేసేసింది మిస్టర్ బచ్చన్. హీరో రవితేజ చాలా ఫీలయ్యేలా చేసిన సినిమా. ఈగిల్, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయినా తాను బాధపడనని, ఎందుకంటే ఏదో కొత్తగా ట్రై చేసి ఫెయిల్ అయ్యానని, కానీ మిస్టర్ బచ్చన్ అలా కాదని రవితేజనే సన్నిహితుల దగ్గర చెబుతుంటారు. పవన్ తో ఉస్తాద్ అనే సినిమా అలా వార్తల్లో ఉంది. ఎప్పుడు జరుగుతుందో దానికే తెలియదు. ఇలాంటి నేపథ్యంలో రామ్ తో హరీష్ శంకర్ సినిమా అంటూ వార్తలు. కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ తో సినిమా అనే వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు తమ్ముడిని చూసారు.. ఇకపై అన్నయ్యను చూస్తారు అనేలా డైలాగులు కూడా రెడీ అయిపోయాయి.
నిజానికి రామ్ ను హరీష్ కలిసింది డిసెంబర్ లో. జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. రామ్ అంత సులువుగా ఎవరికీ ఒకే చెప్పడు. ఇప్పుడు నాగ్ చైతన్య చేస్తున్న విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ముందుగా వెళ్లింది రామ్ దగ్గరకే. ఆయన నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ అటు వెళ్లింది. అలాంటి క్రేజీ దర్శకుడికే నో చెప్పాడు రామ్. అంత సులువుగా కథ ఒకే చేయడు, దర్శకుడికి ఒకే చెప్పడు. మరి హరీష్ శంకర్ కాంబినేషన్ కు ఒకే చెప్పడం అనేది అంత సులువుగా జరిగేది కాదు.
ప్రశాంత్ వర్మ ది చిత్రమైన కేసు. హిట్ వచ్చి కూడా ఏడాదిగా సినిమా సెట్ కావడం లేదు. ఒక సినిమా సెట్ అయినా క్యాన్సిల్ అయింది. మోక్షు తో సినిమా సెట్ అయినా కూడా సెట్ మీదకు వెళ్లడం లేదు. ప్రభాస్ తో సినిమా అన్నది వార్తల్లో ఉంటుంది. ఈ లోగా ప్రభాస్ కాంబినేషన్ తో చాలా పేర్లు వినిపించేస్తున్నాయి.
ఇంకా ఇలా చాలా కాంబినేషన్లు వార్తల్లోనే కనిపిస్తున్నాయి. ఇంకెన్నాళ్లు కనిపిస్తూ ఉంటాయో?
విజయ్-శాంతి కాంబో ఎప్పుడు
ఎవుడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు…
గుడ్డు పెట్టే గుద్ద కే తెలుస్తుంది మంట.. సొల్లు కార్చే మూతికి ఏమి తెలుస్తుంది.. దెంగేయ్ పోరంబోకు ఎదవ పెతి వోడు సొల్లు సోది చెప్పడమే.
Avunu nijame
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు