ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ గడువు దగ్గర పడుతోంది. అయితే ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దాని మీద కూటమిలోని పార్టీల ఐక్యత అయితే కనిపించడం లేదు. ఈ విషయంలో తలోదారి గానే పయనిస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్సీలు ఇద్దరు బరిలో ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్సీకి మరో చాన్స్ ఇచ్చి గెలిపించుకోవాలని టీడీపీ చూస్తోంది. ఆ విధంగా రఘువర్మకి మా మద్దతు అని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీకి 2023లో పట్టభద్రుల ఎన్నికల విషయంలో రఘువర్మ మద్దతు ఇచ్చారన్న కారణంతో ఆయనకే తమ సపోర్ట్ అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో స్థానిక టీడీపీ అభిప్రాయాలను తీసుకుని అధినాయకత్వం తన నిర్ణయం ప్రకటించింది. రఘువర్మకు గెలిపించుకుంటే తమ బలం శాశనమండలిలో పెరుగుతుందని భావిస్తోంది. బీజేపీ అయితే మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులునాయుడుకు మద్దతు ఇస్తోంది. ఆయన గతంలో ఆరేళ్ల పాటు బాగానే పనిచేశారు. బీజేపీ మద్దతు ఆయనకు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అటు వైపు వెళ్ళకుండా తన నిర్ణయం ఇదేనని చాటి చెప్పింది. దాంతో ఇపుడు కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉంది.
అయితే బీజేపీ గాదెకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో వెనక్కి వస్తుందని అనుకోవడం లేదు. ఇక జనసేన ఏవరికి మద్దతు ఇస్తుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. వామపక్షలా నుంచి విజయగౌరి పోటీలో ఉన్నారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రఘువర్మ, గాదే శ్రీనివాసులనాయుడు ఇద్దరూ విజయనగరం జిల్లాకు చెందిన వారు కావడంతో ఎవరి గెలిచినా ఆ జిల్లా నుంచే ఎమ్మెల్సీ ఉంటారని అనుకోవచ్చు.
మరి విశాఖ ని న్యూయార్క్ నగరానికి మోడల్ గా తీర్చిదిద్దిన మా సమ్మోహనుడు.. జగన్ మోహనుడు.. బరిలో నుండి తప్పుకున్నాడా..?
..
ఒకసారి ఉత్తరాంధ్ర పర్యటన కి వెళ్లి.. స్టాట్యూ అఫ్ లిబర్టీ లాగా చేయెత్తి నిలబడితే.. గుద్దుతారు కదా .. ఓట్లు..
ఎందుకు తప్పుకున్నట్టో మరి..
..
కూటమి ప్రభుత్వం మీద రెండు నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంటె.. ఇతను పారిపోతున్నాడేంటి.. అన్నిట్లో రివర్స్ అలవాటైపోయిందా..?
..
ఉత్తరాంధ్ర కి ఆఫ్టర్ అల్ ఒక ఇంచార్జి ని పెట్టుకోడానికి.. అభ్యర్థులు దొరక్క కిందా మీద పడుతున్నాడు..
అదొక పార్టీ.. మళ్ళీ వాడికి “ఆదరణ” అంటూ సొల్లు కబుర్లు..
Election ante bayam anduke paripotunnadu. monne ga shock kottindi
Wow good
కాల్ బాయ్ జాబ్స్ >>>