పరిశ్రమలు మూతపడుతున్నాయి

కొత్త పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందరికీ మంచి జరుగుతుందని భావించిన వారి ఆశలు తల్లకిందులు అవుతున్నాయి.

కొత్త పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందరికీ మంచి జరుగుతుందని భావించిన వారి ఆశలు తల్లకిందులు అవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వరసబెట్టి పరిశ్రమలు మూతపడుతూండడంతో కార్మికులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో వరసగా ఫెర్రో పరిశ్రమలు మూతపడుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షట్టర్ క్లోజ్ చేయడంతో వీటిని నమ్ముకున్న వారంతా వీధిలో పడుతున్నారు. తాజాగా మరో ఫెర్రో పరిశ్రమ మూతపడడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు.

కార్మికులు, ఉద్యోగులకు రెండు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంటే వాటిని చెల్లించకుండానే మూతపడడంతో వారు లబోదిబోమంటున్నారు. ఈ పరిశ్రమల యాజమాన్యాలు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను విధులకు ఇక రావాల్సిన అవసరం లేదని చెబుతూండడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలు ఇవ్వకుండా పరిశ్రమలను మూసివేయడం కార్మిక చట్టాల ప్రకారం విరుద్ధమని అంటున్నారు. జిల్లాకు కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్న వారు ముందుగా ఉన్న పరిశ్రమలను మూసివేయకుండా చూడాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఫెర్రో పరిశ్రమలను తెరిపించాలని కార్మికులు కోరుతున్నారు. పరిశ్రమలను తెరిపించుకునేందుకు ఆందోళనలు చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో ఇప్పటికే చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. సెజ్‌లలో పరిశ్రమలు మూతపడితే ఉపాధి అవకాశాలు మరింతగా తగ్గిపోతాయని ఆందోళన చెందుతున్నారు.

9 Replies to “పరిశ్రమలు మూతపడుతున్నాయి”

  1. ఇలాంటి గాలి వార్తలు ఒక్క GA లొనె నిపిస్తాయి! గూగల్ మొత్తం వీతికినా కనపడవు!!

  2. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన నట్టు అలా మొరగడం గ్యాస్ ఆంధ్రకు మొరగడం అలవాటే

    దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు . అది పెద్ద ఛాన్తాడు లిస్ట్ అవుతుంది. దానికి మంచి ఉదాహరణలు రామోజీరావు గారి మీద పెట్టిన పోస్తే వేట వేటగాడు అని. అది ఎప్పుడో రామోజీ బ్రతికున్నప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్ట్ అది. దానిని తిరిగి ఈ మధ్యనే పెట్టాడు.

    వీని కన్నా దరిద్రుడు చండాలుడు ఈ భూ ప్రపంచం లో భూతద్దం వేసిన దొరకడెమో .

Comments are closed.