సుధీర్ బాబు ఫాదర్ సెంటిమెంట్

హీరోకు ఇద్దరు తండ్రులు. కన్నతండ్రి డబ్బులు కోసం కొడుకును అమ్మేస్తే.. పెంచిన తండ్రి అదే డబ్బు కోసం కొడుకును రోజూ వాడుతుంటాడు. కన్నతండ్రి కాదని తెలిసినా కొడుకు ఎనలేని ప్రేమ చూపిస్తుంటాడు. మరి అదే…

హీరోకు ఇద్దరు తండ్రులు. కన్నతండ్రి డబ్బులు కోసం కొడుకును అమ్మేస్తే.. పెంచిన తండ్రి అదే డబ్బు కోసం కొడుకును రోజూ వాడుతుంటాడు. కన్నతండ్రి కాదని తెలిసినా కొడుకు ఎనలేని ప్రేమ చూపిస్తుంటాడు. మరి అదే టైమ్ లో కన్నతండ్రి మళ్లీ సీన్ లోకి వస్తే.. పెంచిన తండ్రి అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్తే..? అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడు..?

కొద్దిసేపటి కిందట విడుదలైన ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రయిలర్ చూస్తే మనకు అర్థమైంది ఇది. ఇలా చాలా విషయాన్ని ట్రయిలర్ లోనే చెప్పేయడం వెనక మేకర్స్ ఉద్దేశం తెలుస్తూనే ఉంది. కథగానే కాకుండా, భావోద్వేగాల పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం కనిపిస్తోంది.

తొలిసారి సుధీర్ బాబు ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ పాత్ర పోషించినట్టు ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది. మిడిల్ క్లాస్ కుర్రాడిలా అతడి లుక్, యాక్టింగ్ బాగున్నాయి. ఇక కన్నతండ్రిగా సాయిచంద్, పెంచిన తండ్రిగా సాయాజీ షిండే బలమైన పాత్రలు పోషించారు.

సుధీర్ బాబు తన పేరును మహేష్ బాబు అని చెప్పడం, దానికి సాయిచంద్ ఎగతాళి చేయడం సినిమాలో చిన్న ఫన్ ఉందనే విషయాన్ని చెబుతోంది. అభిలాష్ రెడ్డి కంకర డైరక్ట్ చేసిన ఈ సినిమా 11న థియేటర్లలోకి వస్తోంది.

3 Replies to “సుధీర్ బాబు ఫాదర్ సెంటిమెంట్”

Comments are closed.