ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు, రీసెంట్ గా వచ్చిన శ్రీవిష్ణు శ్వాగ్ సినిమాకు ఓ పోలిక ఉంది. ఈ రెండు సినిమాలూ తమ పాత్రలతో ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేశాయి.
ముందుగా సలార్ విషయానికొద్దాం.. ఈ సినిమాలో పాత్రలు, అందులో వంశాల్ని అర్థం చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. దానికితోడు దర్శకుడు నీల్, టిపికల్ స్క్రీన్ ప్లే ఒకటే.
సలార్ సినిమాలో శౌర్యాంగ, మన్నార్, ఘనియార్ వంశాల్ని చూపించారు. ఏ పాత్ర ఏ వంశానికి చెందిందో తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం అప్పట్లో పెద్ద సమస్యగా మారింది. దీంతో సినిమా విడుదలైన రెండో రోజే పాత్రలు, వంశాలతో ఫ్యామిలీ ట్రీ చూపిస్తూ పోస్టర్ విడుదల చేశారు.
సరిగ్గా అదే కన్ఫ్యూజన్ శ్వాగ్ సినిమాతో కూడా వచ్చింది. ఒకదానివెంట మరొకటి వరుసగా పాత్రల్ని ప్రవేశపెడుతూ వాళ్లతో రకరకాల డైలాగ్స్ చెప్పిస్తుంటే, ఎవరేంటనేది అర్థంకాలేదు. టికెట్ తో పాటు, పాత్రలను తెలిపే బుక్ లెట్ ఇస్తే బాగుండేదంటూ సెటైర్లు పడ్డాయి. దీంతో శ్వాగ్ యూనిట్ విడుదల రోజే వంశవృక్షాన్ని విడుదల చేయాల్సి వచ్చింది.
ఇలా ఈమధ్య కాలంలో సలార్, శ్వాగ్ మాత్రమే తమ పాత్రలు, వంశాలతో ప్రేక్షకుల్ని గందరగోళానికి గురిచేశాయి. ఇంత కన్ఫ్యూజన్ లో కూడా సలార్ హిట్టయింది. శ్వాగ్ ఏమౌతుందో చూడాలి.
Vamsam🤣🤣😂😂😇😇😇😇
Call boy jobs available 9989793850
అందుకే థియేటర్లో చూడం
vc estanu 9380537747