పిల్లలకు నా చరిత్ర చెప్పను – ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కు ఓ చరిత్ర ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు అతడు. ఇప్పటికీ నందమూరి వంశంలో ప్రతి ఒక్కరు సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటారు. అయితే తను మాత్రం తన కొడుకులకు…

జూనియర్ ఎన్టీఆర్ కు ఓ చరిత్ర ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు అతడు. ఇప్పటికీ నందమూరి వంశంలో ప్రతి ఒక్కరు సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటారు. అయితే తను మాత్రం తన కొడుకులకు చరిత్ర చెప్పనంటున్నాడు తారక్.

“నా తండ్రి నటుడు, నా తాత ఓ నటుడు. కాబట్టి నేను కూడా నటుడ్ని అవ్వాలని వాళ్లు నాకు చెప్పలేదు. నాకు నచ్చింది చేయమన్నారు. నేను జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఆటగాడ్ని. అంతేకాదు, నేనొక ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ ని. చిన్నప్పుడే చాలా ప్రదర్శనలిచ్చాను. ఎక్కువ చరిత్ర కలిగి ఉండడం కూడా మన తర్వాతి తరానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాన్న లేదా తాత గురించి చెప్పడం కంటే, నా పిల్లలకు నేనే ఓ ఎగ్జాంపుల్ గా నిలవాలనుకుంటున్నాను.”

తండ్రి, తాత కంటే తన గురించి తన కుమారులు ఎక్కువగా మాట్లాడుకునేలా చరిత్ర సృష్టించాలనేది తన తాపత్రయమని, నిత్యం తను అదే ప్రయత్నంలో ఉంటానని అంటున్నాడు ఎన్టీఆర్.

ఈ సందర్భంగా దేవర-2కు సంబంధించి ఆసక్తికర విశేషాలు బయటపెట్టాడు ఎన్టీఆర్. పార్ట్-2ను మరింత పెద్దగా తీస్తామని, దర్శకుడికి నెల రోజులు రెస్ట్ ఇచ్చామని, ఆ తర్వాత దేవర-2 పనులు మొదలవుతాయని స్పష్టం చేశాడు.

“దేవర-2 కోసం స్టోరీ రెడీగాఉంది. కాకపోతే దానిపై ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంది. పార్ట్-2కు సంబంధించి రెండు పెద్ద సీక్వెన్సుల షూటింగ్ కూడా పూర్తిచేశాం. పార్ట్-2ను మరింత పెద్దదిగా ఎలా చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం.”

దేవర-1 సినిమా థియేటర్లలో మొదటి వారం పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు మరింత మంది ప్రేక్షకుల్ని రప్పించేందుకు, దావూదీ సాంగ్ ను యాడ్ చేశారు. ఆల్రెడీ ఈ సాంగ్ యూట్యూబ్ లో పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే.

6 Replies to “పిల్లలకు నా చరిత్ర చెప్పను – ఎన్టీఆర్”

    1. Lowdeke balls ki andariki unnapudu ma Anna ki history lekapovadam entra….ni yamma moguda 20yrs ke faction movie thisindi…ni Abba na dance lo dummu repindi

  1. పొరపాటున ఒక రెండు ప్లాప్ లు పడితే మల్ల మీరు మీ తాత పేరు జపిస్తారు ఆయన చరిత్ర ని మీరే చెప్తారు జనాలకి అప్పుడు ఆటోమాటిక్ గ తెలుస్తుంది లెండి మీ పిల్లలకి

Comments are closed.