రెండు వందల కోట్ల రూపాయల విలువైన స్కామ్ లో జైలు పాలైన సుఖేష్ చంద్రశేఖర్ తన సన్నిహితురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు మంచిదనే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. సుఖేష్ పై దాదాపు ముప్పై కేసులు నమోదయ్యాయి. వీటి విచారణ నిమిత్తం ప్రస్తుతం ఇతడు జైల్లో ఉన్నాడు. సుఖేష్ పై కేసుల విచారణలో భాగంగా నమోదైన అభియోగ పత్రాల్లో జాక్వెలిన్ పేరును కూడా నమోదు చేశాయి. విచారణఖు కూడా ఆమె హాజరైంది.
సుఖేష్ నుంచి ఆమె భారీ ఎత్తున లబ్ధి పొందిందని, జాక్వెలిన్ ఆమె కుటుంబీకులు సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకూ బహుమతులు పొందినట్టుగా ఈడీ కూడా పేర్కొంది. ఆ మేరకు జాక్వెలిన్ బ్యాంకు డిపాజిట్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆమె సుఖేష్ నుంచి పొందిన బహుమతుల విలువ కన్నా.. ఆమె కు సంబంధించి ఎక్కువ మొత్తాన్నే అటాచ్ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.
అయితే ఆ హీరోయిన్ ను అరెస్టు చేయలేదు. ఆమె ఎంచక్కా తన సినిమాలు చేసుకుంటూ ఉంది. తన పనులు తాను చేసుకుంటూ ఉంది. సరదదాగా, ఉల్లాసంగా ఫొటోలు దిగుతూ ఫొటోలను కూడా పోస్టు చేస్తూ ఉంది. ఇలా ఆ హీరోయిన్ రిలాక్డ్స్ గానే ఉంది.
ఆ సంగతలా ఉంటే.. తన లాయర్ కు పెద్ద లేఖ రాశాడట సుఖేష్ చంద్రశేఖర్. ఆ లేఖలో జాక్వెలిన్ గురించి ప్రధానంగా పేర్కొనట్టుగా సమాచారం. ఆమె అమాయకురాలు అంటున్నాడట సుఖేష్. ఆమె తన నుంచి బహుమతులు పొందిన మాట వాస్తవమే అయినా, ఆ డబ్బు అంతా తన కష్టార్జీతం అని అతడు చెబుతున్నాడట. స్కామ్ సొమ్ములు వేరే, తను జాక్వెలిన్ కోసం పెట్టిన ఖర్చు సొమ్ములు వేరే అని అతడి ఉద్ధేశం.
తనకు కోల్ మైన్స్ ఉన్నాయని, టీవీ చానళ్లలో షేర్స్ ఉన్నాయని.. అలా తను ఆర్జించిన సొమ్ములో కొంత జాక్వెలిన్ కోసం ఖర్చు పెట్టినట్టుగా సుఖేష్ తన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తను, జాక్వెలిన్ ఒకప్పుడు బంధంలో ఉండే వారమని, ఆ సాన్నిహిత్యంతోనే ఆమెకు తను బహుమతులు ఇచ్చినట్టుగా అతడు పేర్కొన్నాడు. ఆ గిఫ్టులు తమ బంధానికి ప్రతీకలు అని, తను చట్టబద్ధంగా సంపాదించిన సొమ్ముతోనే ఆమెకు గిఫ్టులు ఇచ్చినట్టుగా సుఖేష్ తన లాయర్ కు వివరించాడట.
విచారణ జరిగితే ఇదంతా స్పష్టం అవుతుందని కూడా విశ్వాసం వ్యక్తం చేశాడట. మొత్తానికి జైల్లో ఉన్నా.. జాక్వెలిన్ మీద ఇతడికి ప్రేమ తరిగినట్టుగా లేదు. ఆమె ను ఈ కేసుల ఉచ్చు నుంచి తప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు.