సుమంత్ కు టర్నింగ్ ఇస్తుందా?

అక్కినేని ఇంటి నుంచి వచ్చిన హీరోల్లో అన్నీ వుండి కెరీర్ ఊపందుకోని హీరో ఎవరు అంటే సుమంత్ నే. ఎక్కడో బ్యాడ్ లక్ వెన్నాడుతోంది. ఇప్పుడు మంచి పాత్ర పడింది. మంచి సినిమా వస్తోంది.…

అక్కినేని ఇంటి నుంచి వచ్చిన హీరోల్లో అన్నీ వుండి కెరీర్ ఊపందుకోని హీరో ఎవరు అంటే సుమంత్ నే. ఎక్కడో బ్యాడ్ లక్ వెన్నాడుతోంది. ఇప్పుడు మంచి పాత్ర పడింది. మంచి సినిమా వస్తోంది. మరి ఈ సినిమాతో అయినా కెరీర్ టర్నింగ్ ఇస్తుందా? అన్నదే ఆసక్తికరమైన పాయింట్ ఇప్పుడు. సీతారామ్ అనే మంచి ప్రాజెక్టులో విష్ణుశర్మ అనే మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు సుమంత్.

ఇప్పటి వరకు హీరోగా చేసాడు. కామియోలు చేసాడు. తప్ప ఓ మంచి క్యారెక్టర్ చేయలేదు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కొరత చాలా వుంది. ఈ లైన్ లోకి వచ్చి, క్లిక్ కావాలే కానీ చాన్స్ లే చాన్స్ లు. అందులో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వుండనే వుంది.    

`సీతారామంలో సుమంత్ కూడా ఉన్నాడు` అనే విష‌యం తెలిసి… ఎవ‌రూ పెద్ద‌గా ఉత్సాహ‌ప‌డిపోలేదు. కానీ… బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌గా సుమంత్ లుక్ చూడ‌గానే… కాస్త ఆసక్తి పెరిగింది. ఎప్పుడూ సుమంత్ ని ఈ కోణంలో చూడ‌క‌పోవ‌డం వ‌ల్ల వచ్చిన ఆశ్చర్యం అది. `సీతారామం` క‌థ‌కు సుమంత్ ఎంత ప్ల‌స్ అవుతాడో ఇప్పుడే చెప్ప‌లేం గానీ, ఈ సినిమా మాత్రం సుమంత్ కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింటే.

ఎందుకంటే.. హీరోగా చేద్దామంటే, బ‌య‌ట పోటీ మామూలుగా లేదు. త‌న శైలికి, స్థాయికి, మార్కెట్ కి త‌గిన క‌థ‌లా అందుబాటులో లేవు. అలాంట‌ప్పుడు క‌థ‌ని మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర‌లు ఎంచుకొంటూ వెళ్తే… సుమంత్‌కి చాన్స్ ఎక్కువ వుంటుంది. దానికి `సీతారామం` తొలి మెట్టు అయ్యే అకాశం ఉంది.

'సీతారామం'లో సుమంత్ లుక్ బ‌య‌ట‌కు రాగానే… చిత్ర‌సీమ కూడా సుమంత్ వైపు దృష్టిసారించ‌డం మొద‌లెట్టింది. 'సుమంత్‌లో ఈ కోణం కూడా ఉందా? ఇలాక్కూడా సుమంత్ ని వాడుకోవ‌చ్చా' అని ఆలోచించ‌డం మొద‌లెట్టింది. లుక్ అలా వ‌చ్చిందో లేదో… అప్పుడే రెండు ఆఫ‌ర్లు సుమంత్ ని వెదుక్కొంటూ వెళ్లిన‌ట్టు స‌మాచారం. అందులో ఓ పెద్ద బ్యాన‌ర్ సినిమా కూడా ఉంది. 

కేవ‌లం లుక్ తోనే.. రెండు ఆఫ‌ర్లు సంపాదించేశాడంటే.. సినిమా బ‌య‌ట‌కు వ‌స్తే, అందులో సుమంత్ పాత్ర క్లిక్ అయితే… ఆ వ్య‌వ‌హారం వేరేలా ఉంటుంది.