ఆ హీరో సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్

ఓవైపు థియేట్రికల్ వ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిన పడినప్పటికీ, మరోవైపు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు మాత్రం ఓటీటీ వైపు చూస్తున్నాయి. మంచి డీల్ సెట్ అయితే నేరుగా ఓటీటీ రిలీజ్ కింద తమ సినిమాను…

ఓవైపు థియేట్రికల్ వ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిన పడినప్పటికీ, మరోవైపు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు మాత్రం ఓటీటీ వైపు చూస్తున్నాయి. మంచి డీల్ సెట్ అయితే నేరుగా ఓటీటీ రిలీజ్ కింద తమ సినిమాను ఇచ్చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. బజ్ లేని సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడమే. ఈ క్రమంలో మరో సినిమా డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీని పేరు కిన్నెరసాని.

మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన సినిమా కిన్నెరసాని. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పూర్తి హక్కుల్ని జీ గ్రూప్ దక్కించుకుంది. ఈనెల 10న జీ5లో డైరక్ట్ గా రిలీజ్ చేయబోతోంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాను నిర్మించాడు. థియేటర్లలో రిలీజ్ చేయకుండా, నేరుగా ఇలా 'జీ' కి ఇచ్చేశాడు.

హీరో కల్యాణ్ దేవ్ కు థియేట్రికల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. రీసెంట్ గా అతడు నటించిన సూపర్ మచ్చి అనే సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో.. కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేయడం రిస్క్ గా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఇలా నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేస్తున్నారు. ఇదే లైన్ లో కల్యాణ్ దేవ్ నటించిన మరో 2 సినిమాలు కూడా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇక కిన్నెరసాని విషయానికొస్తే.. ఇది మిస్టరీ థ్రిల్లర్ కథ. వేద అనే అమ్మాయి తన తండ్రి కోసం వెదకడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంతకుముందు నాగశౌర్యతో అశ్వద్థామ అనే సినిమా తీసిన రమణతేజ, ఈ కిన్నెరసానికి దర్శకుడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.