వినరో భాగ్యము విష్ణు కథ అన్న టైటల్..హీరో సాఫ్ట్ లుక్స్. మురళీశర్మ ఫన్..హీరోయిన్ తో డ్యూయట్. అన్నింటికి మించి మాంచి క్లాస్ సాంగ్స్. సినిమా ట్రయిలర్ లో చిన్న మెసేజ్ టచ్ కూడా ఇచ్చారు. టీజర్ లో కూడా అంతా మన ఇరుగు పొరుగులే అన్న కలర్ కూడా కలిపారు.
ట్రయిలర్ లో ఓ చిన్న విలనిజం ను అయితే చూపించారు కానీ అది సినిమాకు రెగ్యులర్ గా అవసరం అనే ఆలోచనతో చేసి వుంటారనుకున్నారు అంతా. ఇవన్నీ కలిసి ఈ సినిమా మీద ఓ ఫీల్ గుడ్ ఒపీనియన్ వచ్చింది. కానీ సర్ప్రయిజ్ ఏమిటంటే ఈ సినిమా థ్రిల్లర్ అంట.
కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు. సర్ప్రయిజ్ ట్విస్ట్ లు వుంటాయట. పైగా గీతా సంస్థ నుంచి వస్తున్న వెరీ..వెరీ ఫస్ట్ థ్రిల్లర్ ఈ సినిమా. ఇప్పటి వరకు గీతా ఈ థ్రిల్లింగ్ జానర్ల జోలికి పోలేదు. ఫస్ట్ టైమ్ ఇలాంటి సినిమా చేస్తున్నారు. కొత్త దర్శకుడు అబ్బూరి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కథను తయారు చేసారని, చాలా కధలు విని విని, ఎవరైనా కథ చెబుతుంటే ముందే జరుగుతుందో అర్థం అయిపోతూ వుంటుందని, కానీ ఈ కథలో అలాంటి చాన్స్ లేదని నిర్మాత బన్నీ వాస్ నే అంటున్నారు.
తనకే ఒకటి రెండు చోట్ల సర్ప్రయిజ్ ఝలక్ అనిపించిందని బన్నీ వాస్ అంటున్నారు. అంటే థ్రిల్లర్ అన్నది కచ్చితంగా అలరించేలాగే వుంటుందనుకోవాలి. సరైన హిట్ కోసం చూస్తున్నాడు హీరో కిరణ్ అబ్బవరం..ఇది ఉపయోగపడుతుందేమో చూడాలి మరి.