సూర్య సినిమా మార్కెట్ అంతేనా?

తమిళ సూపర్ స్టార్ సూర్య అంటే తెలుగు నాట కూడా మాంచి క్రేజ్ వుంది. ఈ మధ్య అది కాస్త డౌన్ అయినా, ఓటిటిలో వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో…

తమిళ సూపర్ స్టార్ సూర్య అంటే తెలుగు నాట కూడా మాంచి క్రేజ్ వుంది. ఈ మధ్య అది కాస్త డౌన్ అయినా, ఓటిటిలో వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మళ్లీ సెట్ అయింది. అయితే థియేటర్ రైట్స్ విషయంలో మాత్రం ఇంకా కిందకే వున్నట్లు కనిపిస్తోంది.  

సన్ పిక్చర్స్ సంస్థ లేటెస్ట్ గా సూర్యతో ఓ సినిమా నిర్మిస్తోంది. ఈటీ అనే ఈ సినిమా తెలుగు హక్కులకు మరీ క్రేజీ ఆఫర్ లు రావడం లేదని బోగట్టా.

మేకర్లు ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులను ఏడు కోట్ల రేషియోలో కోట్ చేస్తున్నారు. కానీ బయ్యర్ల వైపు నుంచి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. నాలుగు కోట్ల రేంజ్ కు మించి వర్కవుట్ కాదని బయ్యర్లు పెదవి విరుస్తున్నారని బోగట్టా. 

రెండు రాష్ట్రాలు అంటే మూడు ఏరియాలు కలిపి జస్ట్ నాలుగు కోట్లు అంటే తెలుగు లో చిన్న హీరో రేంజ్. అయితే సూర్య ఇప్పుడు అన్నీ వైవిధ్యమైన సినిమాలే ఎంచుకుని చేస్తున్నాడు. మాస్, యాక్షన్ సినిమాలు పక్కన పెట్టాడు. బహుశా అలాంటివి అయితే మన దగ్గర ఎక్కువ రేటు పలుకుతాయేమో?