సూర్య సినిమాకు ఇంత రేటా?

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 9 కోట్లకు తీసుకున్నారు. అంటే నైజాం 3 కోట్లు, ఆంధ్ర 4 కోట్లు, సీడెడ్‌కు 2 కోట్ల వంతున విక్రయించాల్సి వుంటుంది.

తమిళ సూపర్ స్టార్ సూర్య సినిమాలు అంటే ఇప్పటికీ మన వాళ్లకు క్రేజ్ ఉంది. కానీ మార్కెట్ లెక్కలు చూసుకుంటే దశాబ్దం కాలం క్రిందటి సంగతి వేరు. ఇప్పుడు వేరు. క్రేజ్ అలాగే వున్నా, మార్కెట్ మాత్రం లేదు. ఇప్పుడు ఈ మార్కెట్‌ను పెంచాలని డిసైడ్ అయ్యారు నిర్మాత నాగవంశీ. దానికి ఆయనకు టైమ్ కలిసి వచ్చింది. దానికి కారణం ఏమీ లేదు.. త్వరలో వెంకీ అట్లూరి-సూర్య కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ చేస్తూ వుండడమే. అయితే దాని కన్నా ముందుగా కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్‌లో రెట్రో అనే సినిమా చేస్తున్నారు సూర్య.

ఇప్పుడు ఈ సినిమా హిట్ కావాలి. మంచి వసూళ్లు కళ్ల చూడాలి. మంచి మార్కెట్ రావాలి. ఇదంతా ఓ ఫీట్. రెగ్యులర్‌గా ఎవరో ఒకరు సూర్య సినిమాను తీసుకుని విడుదల చేస్తే అంత సీన్ రావడం కష్టం. అందుకే నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగిపోయారు. గతంలో విజయ్ లియో, ఎన్టీఆర్ దేవర సినిమాను నాగవంశీ కొని విడుదల చేశారు. ఇక ఈ పనికి దిగను అని ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు మాట మార్చి మళ్లీ రంగంలోకి దిగక తప్పలేదు.

అందుకే సూర్య లేటెస్ట్ సినిమా రెట్రో ను 9 కోట్లకు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 9 కోట్లకు తీసుకున్నారు. అంటే నైజాం 3 కోట్లు, ఆంధ్ర 4 కోట్లు, సీడెడ్‌కు 2 కోట్ల వంతున విక్రయించాల్సి వుంటుంది. కార్తీక్ సుబ్బరాజ్-సూర్య కాంబినేషన్ కనుక క్లిక్ అయితే 9 కోట్ల వసూళ్లు పెద్ద కష్టం కాదు. అలా క్లిక్ కాకుంటే వెంకీ అట్లూరి-సూర్య కాంబినేషన్ సినిమా మీదకే ఆ భారం కూడా పడుతుంది.

3 Replies to “సూర్య సినిమాకు ఇంత రేటా?”

Comments are closed.