విషాదం.. ఆ 8 మంది మృతి

ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన దుఃఖాంతమైంది. మట్టిపెళ్లలు విరిగి పడిన ఘటనలో టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన దుఃఖాంతమైంది. మట్టిపెళ్లలు విరిగి పడిన ఘటనలో టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు కాగా, ఇద్దరు ఇంజనీర్లు.

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగం పనులు జరుగుతున్న టైమ్ లో టన్నెల్ లోపల మట్టిపెళ్లలు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. ఆ టైమ్ లో సొరంగంలో 50 మంది పని చేస్తున్నారు. 42 మంది వెంటనే అక్కడ్నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకోగా.. టెన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు దగ్గరగా ఉన్న 8 మంది మాత్రం మట్టిలో చిక్కుకుపోయారు.

వారిని వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టండి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. అయితే టెన్నెల్ ఊట నీరు అధికంగా రావడం, బురద భారీగా పేరుకు పోవడంతో సహాయక చర్యలు ముందుకుసాగలేదు.

ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఇక వాళ్లు బతికే అవకాశం లేదనే అంచనాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు ఈరోజు టన్నెల్ లో మృతదేహాల్ని గుర్తించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బురదలో చిక్కుకున్న మృతదేహాల్ని గుర్తించారు. వాటిపై 3 మీటర్ల మేర మట్టి పేరుకుపోయి ఉన్నట్టు నిర్థారించారు. మృతదేహాల్ని వెలికి తీయడానికి మరింత సమయం పట్టొచ్చు.

5 Replies to “విషాదం.. ఆ 8 మంది మృతి”

  1. ఒకవైపు 8 మంది మనుషులు చనిపోతుంటే SLBC టన్నెల్ దగ్గర చేపల పులుసు చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి .. సిగ్గు ఉందా అసలు

Comments are closed.