హిందీ సినిమా నిర్మాతలకు టాలీవుడ్ కామధేనువు మాదిరిగా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో రెమ్యూనిరేషన్లు, కలెక్షన్లు మ్యాచ్ కావడం లేదు. కోట్లకు కోట్ల రెమ్యూనిరేషన్లు. వాటి మేరకు కూడా లేని థియేటర్ వసూళ్లు. మరోపక్క తెలుగు సినిమాల బడ్జెట్, అమ్మకాలు చూస్తుంటే బాలీవుడ్ నిర్మాతలకు పీనట్స్ మాదిరిగా కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు తెలుగు సినిమా జనాలతో మంచి సంబంధాలు వున్నాయి. అందుకే ఓ ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్ హిట్ సినిమా “కిల్” అందించిన దర్శకుడు నగేష్ భట్‌తో తెలుగు సినిమా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో వున్న ఓ మాట ప్రకారం హీరో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఏమైందో తెలియదు కానీ ప్రస్తుతం రామ్ చరణ్‌తో డిస్కషన్లు సాగిస్తున్నారని బోగట్టా.
ఇక్కడితో ఆగకుండా మరో రెండు మూడు మిడ్-రేంజ్ సినిమాలు కూడా ఇక్కడ చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం, మార్కెట్ మీద ఓ ఈక్వేషన్, అంచనా పెట్టుకుని కరణ్ జోహార్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు నిర్మాతలకే అస్సలు మన హీరోల డేట్‌లు దొరకడం కష్టంగా వుంది. ఇక హిందీ జనాలు కూడా వచ్చేస్తే ఇంకా కష్టమయిపోతుందేమో?
ఇప్పటికే తమిళంలో నిర్మాతలు తగ్గిపోయారు. మన నిర్మాతలే అక్కడి హీరోలకు, దర్శకులకు అండగా వున్నారు. మన నిర్మాతలే హిందీ వైపు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో బాలీవుడ్ జనాలు మన వైపు చూస్తున్నారు. హీరోలు అందరికీ ఇదో మంచి గోల్డెన్ పీరియడ్. కానీ హిట్‌లు పడేవారికి, టికెట్లను తెగేవారికి మాత్రమే.
దీని మీద కూడా గ్రేట్ఆంధ్ర వాడు ఏదో ఒకటి ఊహించి నెగటివ్ రాయలేదు ఇకనుంచి అయినా పేటీఎం వైసీపీకి భజన చేయడం ఆపి మంచి ఆర్టికల్స్ రాయి
నిజమే , ఆ ABN బూతుకిట్టి కి, ఎంకటకిటికీ , TV5 సాంబడికి ఉన్న క్రియేటివిటీ యీడికి లేకపాయ ఎటి సేత్తం
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ramcharan is not an actor. వాడొక dishti బొమ్మ. బాబు పేరు చెప్పుకుని బతికే వాడు. He doesn’t have that natural spark an actor requires.
Everybody and anybody can act , but there must be inborn talent , it doesn’t came just bcs he is son of an actor. Acting skill is not inherited.
Nice charan sir
శంకర్ అయ్యింది.. ఇక కరణా… వద్దు అన్నా.. తెలుగు లో మస్తు టాలెంట్ ఉంది.. ప్రపంచం అంతా పడి చచ్చి పోతోంది
ee combo set aithe rc ki inko paruvu theese cinema ready ainatte….
Karan GA y