టైటిల్ కు తగ్గట్టు ఆకాశంలో రిలీజ్

సూర్య చేస్తున్న కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ టైటిల్ కు తగ్గట్టే సినిమా పాటను ఆకాశంలో రిలీజ్ చేశారు. పిల్ల పులి అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను గాల్లో…

సూర్య చేస్తున్న కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ టైటిల్ కు తగ్గట్టే సినిమా పాటను ఆకాశంలో రిలీజ్ చేశారు. పిల్ల పులి అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను గాల్లో ఎగురుతున్న విమానంలో.. ఆకాశం మధ్యలో రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా స్పైస్ జెట్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనిట్ సభ్యులతో పాటు వంద మంది పిల్లల్ని విమానంలో తీసుకెళ్లారు. పిల్లలంతా ఫస్ట్ టైమ్ విమానం ఎక్కినవారే. సూర్యకు చెందిన అగరం ఫౌండేషన్ ద్వారా ఈ పిల్లల్ని ఎంపిక చేశారు. అలా పిల్లలతో పాటు విమానంలో గాల్లోకి ఎగిరి, ఆకాశంలో ఈ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సాంగ్ లాంచ్ లో సూర్యతో పాటు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. గురు ఫేమ్ సుధా కొంగర డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. పిల్ల పులి  అనే సాంగ్ మెలొడియస్ గా బాగుంది.

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది ఆకాశం నీ హద్దురా. నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు సూర్య. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూస్తున్న ఈ హీరో, ఈ కొత్త సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమా థియేటర్లలోకొస్తోంది.

అందుకే ఆయన రాజమౌళి అనిపించింది