బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో అతడి గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఏకంగా మాదక ద్రవ్యాల కేసులో జైళ్లో ఉండాల్సి వచ్చింది. మరోవైపు మీడియా ఆమెపై చేసిన వ్యాఖ్యలు, ప్రచురించిన కథనాలు ఎన్నో. ఇలా ఎంతో మానసిక వేదన అనుభవించిన రియా.. దాదాపు ఏడాదిగా మీడియాకు ముఖం చూపించడం మానేసింది.
మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. ఇనస్టాగ్రామ్ లో యాక్టివ్ అయింది. త్వరలోనే సినిమాలు కూడా చేయబోతోంది.
అవును.. రియాకు ఇంట్రెస్ట్ ఇంటే తనతో సినిమా తీస్తానంటున్నాడు దర్శకుడు రూమీ జాఫ్రీ. గతంలో రియాతో కలిసి వర్క్ చేసిన ఈ డైరక్టర్.. తన మనసులో ఓ కథ ఉందని, అందులో రియాకు లీడ్ రోల్ ఆఫర్ చేస్తానని చెబుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, రియా కూడా మరోసారి సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అయితే మియా జాఫ్రీలా ఆమెకు ఎంతమంది అవకాశాలిస్తారనేది అనుమానాస్పదం. స్టార్ హీరోలు, దర్శకులు మాత్రం ఆమెకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
బాలీవుడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. రియాకు ఇనిస్టెంట్ గా అవకాశాలు రావొచ్చు. ఎందుకంటే, గత ఏడాదిగా ఆమె మీడియాలో బాగా నలిగింది. అయితే దీర్ఘకాలం ఆమె బాలీవుడ్ లో కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు.