జనం దృష్టిలో పెద్ద స్టార్. కానీ ఇంట్లో మాత్రం రాక్షసుడు. భార్యను చిత్రహింసలు పెట్టే కిరాతకుడు. అతడే బాలీవుడ్ స్టార్ సింగర్ యోయో హనీ సింగ్ అలియాస్ హిర్దేస్ సింగ్. బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా, నటుడిగా కొనసాగుతున్న హనీ సింగ్ పై స్వయంగా అతడి భార్య కేసు పెట్టింది. తనను హనీసింగ్ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ సందర్భంగా హనీ సింగ్ గురించి ఆమె బయటపెట్టిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
తన పాటలు, స్టేజ్ పెర్ఫార్మెన్సులు, రాయల్టీల ద్వారా హనీ సింగ్ ఏడాదికి అటుఇటుగా 4 కోట్ల రూపాయలు సంపాదించేవాడట. అయితే సంపాదించింది దాచుకునేవాడు కాదంట. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో శృంగారాల కోసం మాత్రమే ఖర్చు చేసేవాడట. ఈ క్రమంలో తనను శారీరంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్.
పోలీసులకు ఇచ్చిన వివరాల్లో హనీ సింగ్ వివాహేతర సంబంధాన్ని కూడా బయటపెట్టింది షాలినీ. ఓ పంజాబీ హీరోయిన్ తో హనీ సింగ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. దీనిపై ప్రశ్నించినప్పుడు మాట మార్చి తప్పించుకున్నాడని తెలిపింది. తన ఇంట్లోనే ఎంతో మందితో హనీ సింగ్ సెక్స్ చేసేవాడని, అలా తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడని షాలినీ ఆరోపించింది.
కొసమెరుపు ఏంటంటే.. హనీసింగ్-షాలినీ దాదాపు 15 ఏళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. జనవరి 23, 2011లో షాలినీని పెళ్లాడాడు హనీసింగ్. అంటే దాదాపు 25 ఏళ్లుగా వీళ్లిద్దరి మధ్య బంధం కొనసాగుతోంది.
ఇంత అనుబంధం ఉన్నప్పటికీ.. షాలినీని హనీ సింగ్ పక్కనపెట్టాడు. డ్రగ్స్, అమ్మాయిలకు బానిసయ్యాడు. అంతేకాదు, తనకు పెళ్లయిన విషయాన్ని కూడా బయటకు చెప్పేవాడు కాదంట.
షాలినీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహ హింస చట్టం కింద హనీసింగ్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఆరోపణలపై స్పందించాల్సిందిగా కోర్టు, హనీ సింగ్ కు ఈనెల 28 వరకు గడువు ఇచ్చింది. గతేడాది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి హనీ సింగ్ కంపోజ్ చేసిన ఓ పాట.. యూట్యూబ్ ఇండియాలో టాప్ సాంగ్ గా నిలిచింది.