రానా అరణ్య చూసారు కదా..క్యారెక్టర్ కు తగినట్లు మేకప్. నారప్ప వెంకీని కూడా చూసారు కదా..అంతకు ముందు దాని మాతృక అసురన్ ధనుష్ ను కూడా చూసే వుంటారు. కానీ మెగా హీరోలకు అలా కుదరదు.
పాత్ర ఏదయినా అందంగా వుండాల్సిందే. స్టయిల్ గా కనిపించాల్సిందే. అందుకే 'ఆచార్య' సినిమాలో నక్సలైట్ క్యారెక్టర్లు కూడా స్టయిల్ గా తయారయ్యాయి.
మాంచి బ్రాండెడ్ అండ్ లేటెస్ట్ ఫిట్ ట్రవుజర్లు, షర్ట్ లు, మాంచి షూస్, ట్రిమ్ డ్ బియర్డ్, తో తుపాకులు పట్టుకుని నక్సల్స్ గా తండ్రీ కొడుకులు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రెడీ అయి స్టిల్ కు ఫోజు ఇచ్చారు.
ఆ విధంగా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే ఆచార్య సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ సుమారు నలభై నిమషాలు కనిపిస్తారన్న సంగతి తెలిసిందే.
ఆ స్టిల్ నే బయటకు వదిలారు. కొత్త హెయిర్ లో ఫుల్ గ్లామరస్ గా ఫిట్ గా వున్నారు. రామ్ చరణ్ ఎలాగూ సూపరే. మొత్తం మీద ఈ స్టిల్ ఫ్యాన్స్ కు మాత్రం పండగలా వుంది.