సైరా.. టైటిల్ సాంగ్.. సైరా

సైరా.. ఓ వీరుడి భావోద్వేగ జీవితగాథ. చరిత్రలో మరుగున పడిన స్వాతంత్ర్య పోరాటగాథ. అలాంటి సినిమాకు టైటిల్ సైరా. అలాంటి టైటిల్ కు సాంగ్ రాయడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకే ఆ…

సైరా.. ఓ వీరుడి భావోద్వేగ జీవితగాథ. చరిత్రలో మరుగున పడిన స్వాతంత్ర్య పోరాటగాథ. అలాంటి సినిమాకు టైటిల్ సైరా. అలాంటి టైటిల్ కు సాంగ్ రాయడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకే ఆ పనిని ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెలకు అప్పగించారు. ఆ పాటను బయటకు వదిలారు. సైరాకు సంబంధించి ఇదే తొలిపాట. సైరా.. ఓ సైరా అంటూ సాగే ఈ పాటను శ్రియా ఘోషల్ పాడారు. పాటలో మరో గాయని సునిధి చౌహాన్ కూడా గొంతు కలిపారు.

సినిమాలో ఈ పాటను తమన్నా మీద చిత్రీకరిస్తారు. తమన్నా ఓ కళాకారిణిగా పల్లె పల్లెకు తిరిగి, ఉయ్యాలవాడను కీర్తిస్తూ, జనాల్ని స్వాతంత్ర్య పోరాట ఉద్యమ దిశగా నడిపించే కార్యక్రమం చేపడుతుంది. ఆ నేపథ్యంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. పాట చివరలో నయనతార కూడా గొంతు కలుపుతుంది. అప్పుడు రెండో గాయని స్వరం వినిపిస్తుంది.

పాట సన్నివేశానికి తగిన సాహిత్యం, దానికి తగిన ట్యూన్ కలిసి మాంచి పాటను అందించాయనే చెప్పాలి.