ఈ రోజుల్లో సినిమా విడుదల ముందు సినిమాకు ప్రాఫిట్ రావడం అంటే మాటలు కాదు. అందులోనూ మిడ్ రేంజ్ సినిమా తీసి లాభం తెచ్చుకోవడం మరీ కష్టం.
విరూపాక్ష సినిమా మాత్రం ఈ ఫీట్ సాధించింది. భోగవిల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా దాదాపు యాభై కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 22 కోట్లకు అమ్మడం అన్నది పెద్ద ప్లస్ అయింది. ఈ హక్కులు హోల్ సేల్ గా వెస్ట్ గోదావరి ప్రవీణ్ కు విక్రయించేసారు.
నాన్ థియేటర్ హక్కుల రూపంలో 28 కోట్లు ఆదాయం వచ్చింది. నాన్ థియేటర్, ఇతర హక్కులు వుండనే వున్నాయి. మొత్తం ఖర్చులు పోను ఆరేడు కోట్ల వరకు లాభం మిగిలింది. దీన్ని నిర్మాత ప్రసాద్, హీరో సాయి ధరమ్ తేజ్, సమర్పకుడు సుకుమార్ పంచుకుంటారు. హీరో ఈ సినిమాను కొంత రెమ్యూనిరేషన్, కొంత ప్రాఫిట్ షేరింగ్ ప్రాతిపదికన చేసారు.
విరూపాక్ష సినిమా ఈవారం విడుదలవుతోంది. నిర్మాత హ్యాపీనే. హొల్ సేల్ బయ్యర్ ప్రవీణ్ కూడా మంచి మార్కెట్ చేసి తన పెట్టుబడి వెనక్కు రాబట్టుకున్నారు. ఇక కలెక్షన్లు బాగా వస్తే బయ్యర్లు కూడా హ్యాపీ అవుతారు. అది శుక్రవారం తెలుస్తుంది.