పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారని వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ నుంచి ఓ క్లారిఫికేషన్ లాంటి ప్రకటన వచ్చింది. బందిపోటు పాత్ర హీరోగా తయారవుతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ అప్ డేట్ అంటూ చెప్పుకొచ్చారు.
ఇంతకీ చెప్పింది ఏమిటంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో అద్భుతంగా, భారీ ఎత్తున జరుగుతున్నాయన్నది ఓ పాయింట్. త్వరలో స్పెషల్ ప్రోమో వదులుతామని, అది చాలా అద్భుతంగా వుండబోతొందన్నది రెండో పాయింట్.
కానీ దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నార్నది కేవలం గ్యాసిప్ అని కానీ, అవాస్తవం అని కానీ ఖండించకపోవడం విశేషం. అలా ఖండించడం అనవసరం అనుకున్నారేమో? అలాగే సినిమా ఎంత వరకు వచ్చింది, ఎప్పటికి పూర్తవుతుంది, అసలు ఎప్పుడు విడుదల వుండొచ్చు అన్నది కూడా క్లారిటీ లేదు.
దీనికి చాన్నాళ్లు వెనుక వేసి, ఇంకా 15 రోజులు మాత్రమే షూట్ వున్న ఓజి సినిమా విడుదల డేట్ కూడా ప్రకటించచిన సంగతి తెలిసిందే. హరిహర అప్ డేట్ చూసి పవన్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఒక వేళ గ్యాసిప్ లు నిజమై, క్రిష్ తప్పుకుంటే అప్పుడు ఎలా ఫీలవుతారో?