తమన్నా అప్ కమింగ్ మూవీ ఓదెల-2. ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. కొన్ని సన్నివేశాల్ని, క్లైమాక్స్ రేంజ్ లో తీశామని అంటోంది.
“నేను, సంపత్ నంది ముందుగా ఓ చిన్న కాన్సెప్ట్ గా అనుకున్నాం. ఆ తర్వాత ఇది పెద్ద ప్రాజెక్టుగా మారిపోయింది. కొన్ని సార్లు రెండేసి యూనిట్స్ తో ఒకేసారి పనిచేయాల్సి వచ్చింది. కొన్ని సన్నివేశాల్ని క్లైమాక్స్ రేంజ్ లో షూట్ చేశాం.”
ఇలా ఓదెల-2 ప్రాజెక్టుపై హైప్ ఇచ్చే ప్రయత్నం చేసింది తమన్న. ఈ సినిమా తనకు చాలా పర్సనల్ అని, నిజ జీవితంలో తనలోని ఓ షేడ్ ను ఓదెల-2లోని తన పాత్రలో చూస్తారని అంటోంది.
ఈ సినిమా టీజర్ ను మహాకుంభమేళాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమన్న.. నిజజీవితంలో తను భక్తురాలినని, తన భక్తి ఏ రేంజ్ లో ఉంటుందో సినిమాలో చూస్తారని చెబుతోంది. ఇక ఓదెల-2 విషయానికొస్తే.. ఈ సినిమాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంటాయని అంటోంది.
అశోక్ తేజ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. తమన్న అఘోరీగా నటించిన ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ada akhanda
Ada akhanda