తెలంగాణ ఐపీఎస్ అధికారి హెచ్చ‌రిక‌.. ఏపీ యూట్యూబర్‌లో మార్పు!

ఏపీ పోలీస్ అధికారుల‌కు స‌జ్జ‌నార్‌లా సామాజిక ప్ర‌యోజ‌నం క‌లిగించే ఆలోచ‌న‌లు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోందని నెటిజ‌న్లు అంటున్నారు.

సోష‌ల్ మీడియాను మంచి కంటే చెడు కోసం ఉప‌యోగించే వాళ్లే ఎక్కువ‌. మ‌రీ ముఖ్యంగా డ‌బ్బు సంపాద‌నే ఏకైక ల‌క్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అడ్డ‌మైన దారుల్ని తొక్కుతున్నారు. పైగా సోష‌ల్ మీడియాలో చెడు కంటెంట్‌కు ఉన్న ఆక‌ర్ష‌ణ మంచికి ఉండ‌నే వుండ‌దు. సోష‌ల్ మీడియాలో కొంద‌రు ఇన్ఫ్లూయెన్ష‌ర్లు వ్య‌క్తిగ‌త సంపాద‌న కోసం, మంచీచెడు ఆలోచించ‌కుండా, స‌మాజాన్ని వ‌క్ర‌మార్గంలో న‌డిపించే వాటికి ప్ర‌మోట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన లోక‌ల్‌బాయ్ నాని అనే సోష‌ల్ మీడియాలో ప్ర‌భావితం చేసే యూట్యూబ‌ర్ బెట్టింగ్ యాప్‌ను ప్ర‌మోట్ చేయ‌డం తెలంగాణ‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీసీ స‌జ్జ‌నార్ దృష్టిలో ప‌డింది. దీంతో ఆయ‌న రాష్ట్రాల ఎల్ల‌ల గురించి ఆలోచించ‌కుండా, త‌న‌దైన స్టైల్‌లో స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని సుతిమెత్త‌ని వార్నింగ్ ఇచ్చారు. స‌జ్జ‌నార్ దెబ్బ‌కు స‌ద‌రు యూట్యూబ‌ర్ సానుకూలంగా స్పందించాడు.

ముందుగా స‌జ్జ‌నార్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఏంటో తెలుసుకుందాం.

“మీరు డ‌బ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలిన ప‌నులు. మీ టాలెంట్‌ను ఇత‌ర‌త్రా రంగాల్లో ఉప‌యోగించుకుని సంపాదించుకోవ‌డంలో త‌ప్పు లేదు. అలా చేస్తే మిమ్మ‌ల్ని స‌మాజం హ‌ర్షిస్తుంది. ఇలాంటి ప‌నుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిస‌ల‌ను చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో ఒక్క‌సారి ఆలోచించండి. సోష‌ల్ మీడియా ఇన్ఫ్లూయెన్ష‌ర్ల‌మ‌ని , మేం ఏం చేసినా న‌డుస్తుంద‌నే భ్ర‌మ‌లో ఉండ‌కండి. చ‌ట్ట ప్ర‌కారం మీకు శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని గుర్తుంచుకోండి. ఇప్ప‌టికైనా స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్ర‌మోష‌న్ల‌ను ఆపండి”

బెట్టింగ్‌ల మాయ‌లో ఎంతో మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన ఉదంతాల గురించి మీడియా ద్వారా తెలుసు. అయితే చావుల్ని దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం సొంత సంపాద‌న కోసం ఎలాంటి చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నారో స‌జ్జ‌నార్ మొద‌ట హెచ్చ‌రించారు. ఎవ‌రైనా స‌రే, బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేస్తే చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షార్హుల‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో యూట్యూబ‌ర్ స్పందిస్తూ, ఇక మీద‌ట ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్ర‌మోట్ చేయ‌న‌ని ప్ర‌క‌టించాడు. అత‌నిలో వ‌చ్చిన మార్పును స‌జ్జ‌నార్ అభినందించారు. మిగిలిన సోష‌ల్ మీడియా ఇన్ఫ్లూయెన్ష‌ర్లు కూడా నాని లాగే స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయడం ఆపాల‌ని ఆయ‌న కోరారు. “మేం అలానే చేస్తాం. మా ఇష్టం అనుకుంటే మీపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వు” అని ఆయ‌న హెచ్చ‌రించారు. అదేంటోగానీ, ఏపీ పోలీస్ అధికారుల‌కు స‌జ్జ‌నార్‌లా సామాజిక ప్ర‌యోజ‌నం క‌లిగించే ఆలోచ‌న‌లు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోందని నెటిజ‌న్లు అంటున్నారు.

7 Replies to “తెలంగాణ ఐపీఎస్ అధికారి హెచ్చ‌రిక‌.. ఏపీ యూట్యూబర్‌లో మార్పు!”

  1. వైచీప్ అధికార ప్రతినిధి శ్యామల betting apps కి కూడా brand అంబాసిడర్, భలే భలే వాళ్ళు ఉంటారు ఈ బోకు పార్టీ లో!!

  2. రెడ్ బుక్ అని రాజ్యాంగాన్ని అవమణిస్తున్న పప్పు ని,సనాతన అని డ్రామాలడుతున్న పావలా ని ముందు లోన వెయ్యాలి

Comments are closed.