ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై ర‌గులుతున్న ఉద్యోగులు!

కేవ‌లం ఉన్న‌తాధికారులు, పాల‌క మండ‌లి ప్రాప‌కం కోసం ఉద్యోగ సంఘాల నేత‌లు బాలాజీ అవ‌మానాన్ని అవ‌కాశం తీసుకున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

త‌మ ఆత్మాభిమానాన్ని టీటీడీ పాల‌క మండ‌లికి, ఉన్న‌తాధికారుల‌కు ఉద్యోగ సంఘాల నాయ‌కులు తాక‌ట్టు పెట్టార‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. టీటీడీ ఉద్యోగి బాలాజీపై శ్రీ‌వారి ఆల‌యంలోనే బోర్డు స‌భ్యుడు న‌రేశ్‌కుమార్ రాయ‌లేని భాష‌లో దూషించిన సంగ‌తి తెలిసిందే. బోర్డు స‌భ్యుడి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌ను నిర‌సిస్తూ ఉద్యోగులు ఆందోళ‌న‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో బాధిత చిరు ఉద్యోగి బాలాజీతో తిట్టిన బోర్డు స‌భ్యుడు న‌రేశ్‌కుమార్ చేతులు క‌లిపించి, మ‌మ అనిపించారు.

టీటీడీలో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకూడ‌ద‌నేద‌నేదే అంద‌రి అభిప్రాయం. అయితే అవాంఛ‌నీయ ఘ‌ట‌న జ‌రిగింది. ఉద్యోగుల మ‌నోభావాల‌కు అనుగుణంగా టీటీడీ ఉద్యోగ సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ బోర్డు స‌భ్యుడు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, అలాగే అత‌నితో రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేశారు. కానీ నాలుగు గోడ‌ల మ‌ధ్య ఏం జ‌రిగిందో ఎవ‌రికీ తెలియ‌దు. పైగా ఉద్యోగితో చేతులు క‌లుపుతూ ఉన్న ఫొటోలో బాధిత ఉద్యోగి ముఖంలో ఆవేద‌న ప్ర‌తిబింబించింది.

బోర్డు స‌భ్యుడు మీడియాతో మాట్లాడుతూ తాను క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్టు నామ‌మాత్రంగా కూడా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది త‌మ ఇంటి స‌మ‌స్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని, ఇక‌పై తిరుమ‌ల‌, తిరుప‌తి అభివృద్ధి కోసం ప‌ని చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇలాంటి స‌మాధానం, శిక్ష తాము ఆశించ‌డం లేద‌ని ఉద్యోగులు అంటున్నారు. దేనికోసం ఉద్యోగ సంఘాల నేత‌లు రాజీప‌డ్డార‌ని ఉద్యోగులు నిల‌దీస్తున్నారు.

కేవ‌లం ఉన్న‌తాధికారులు, పాల‌క మండ‌లి ప్రాప‌కం కోసం ఉద్యోగ సంఘాల నేత‌లు బాలాజీ అవ‌మానాన్ని అవ‌కాశం తీసుకున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఉద్యోగ సంఘాల నేత‌ల తీరు త‌మ‌ను తాక‌ట్టు పెట్టిన‌ట్టుగా వుంద‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. బోర్డు స‌భ్యుడు క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్టు ఉద్యోగ సంఘాల నేత‌లు చెప్ప‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్యోగుల ప్ర‌తినిధులుగా కాకుండా, పాల‌క మండ‌లి త‌ర‌పున త‌మ నాయ‌కులు మాట్లాడిన‌ట్టుగా వుందని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

7 Replies to “ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై ర‌గులుతున్న ఉద్యోగులు!”

  1. ఆత్మాభిమానం తాకట్టు పెట్టిన తల వంచిన సనాతన, తెలుగుదేశ ఉద్యోగ సంఘాల నాయకులు.

  2. వెకిలి వెధవ సాక్షాత్తు శ్రీవారి పట్ల అపచారం చేసినప్పుడు ఈ ఉద్యోగులు ఏమి చేశారు?? అప్పుడు మాడా గాడి మీద రగిలిపోలేదేం??

Comments are closed.