రెండు వీకెండ్స్.. ఇద్దరూ వదిలేశారు

టాలీవుడ్ లో అంతే. ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించడం, ఆ తర్వాత టార్గెట్ అందుకోలేక తప్పుకోవడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది.

టాలీవుడ్ లో అంతే. ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించడం, ఆ తర్వాత టార్గెట్ అందుకోలేక తప్పుకోవడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. అలా బ్యాక్ టు బ్యాక్ రావాల్సిన 2 సినిమాలు, ఇప్పుడా తేదీల నుంచి తప్పుకున్నాయి. వాటిలో ఒకటి రాజాసాబ్ కాగా, ఇంకోటి మిరాయ్.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమా తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. లెక్కప్రకారం, ఏప్రిల్ 10న ఈ సినిమా రావాలి. కానీ ఇప్పుడు దసరా పండగ తేదీ కోసం ట్రై చేస్తున్నారు.

రాజాసాబ్ వచ్చిన వారం రోజులకే మిరాయి రాబోతున్నట్టు గతంలో ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్ 18న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడీ సినిమా కూడా వాయిదా పడింది.

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయి సినిమాను ఏప్రిల్ నుంచి ఆగస్ట్ కు పోస్ట్ పోన్ చేశారు. ఆగస్ట్ 1న మిరాయి వస్తుందంటూ కొత్త పోస్టర్ వదిలారు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది మిరాయి. ఈ సినిమాను ఒకేసారి 8 భాషల్లో 2డీ, త్రీడీ వెర్షన్లలో విడుదల చేస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.

హనుమాన్ లో సూపర్ హీరోగా కనిపించిన తేజ సజ్జా, తాజా చిత్రంలో సూపర్ యోధాగా కనిపించబోతున్నాడు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నాడు. మొత్తానికి ఏప్రిల్ బాక్సాఫీస్ నుంచి 2 పెద్ద సినిమాలు తప్పుకున్నాయి.

5 Replies to “రెండు వీకెండ్స్.. ఇద్దరూ వదిలేశారు”

Comments are closed.