మళ్లీ ట్రోలింగ్.. ఆ పని అప్పుడే చేయొచ్చుగా!

నేను నా భావాలను స్టేజ్ పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నుండి ట్విట్టర్ వేదికగా నా భావ ప్రకటన స్వేచ్చని తెలియపరుస్తాను.

నటుడు పృధ్వీని వైసీపీ జనాలు ఈమధ్య చెడుగుడు ఆడుకున్న సంగతి తెలిసిందే. లైలా సినిమా ప్రచార వేదికపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా, సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా ట్రోల్ చేశారు. కొంతమంది ఆయనకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి మరీ తిట్టారు.

దీంతో బాగా హర్ట్ అయిన పృధ్వీ ఒక దశలో సైబర్ క్రైమ్ పోలీస్ ను కూడా ఆశ్రయించారు. తనను బాగా ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయాడు. మొత్తానికి ఆ వ్యాఖ్యలతో లైలా సినిమా డిజాస్టర్ అవ్వడంతో పాటు, పృధ్వీ ఇమేజ్ కూడా కాస్త డ్యామేజీ అయిన మాట వాస్తవం.

ఇప్పుడీ నటుడు ట్విట్టర్ లోకి వచ్చారు. “నేను నా భావాలను స్టేజ్ పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నుండి ట్విట్టర్ వేదికగా నా భావ ప్రకటన స్వేచ్చని తెలియపరుస్తాను.” అంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు దీనిపై కూడా చిన్నపాటి ట్రోలింగ్ నడుస్తోంది.

ఇన్నాళ్లకు జ్ఞానోదయమైందా అంటూ పృధ్వీపై మరోసారి విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. నిన్ను ఎక్కువ రోజు ట్విట్టర్ లో ఉండనివ్వమంటూ కొంతమంది హెచ్చరికలు చేస్తుంటే, ట్విట్టర్ లో కూడా ఏది పడితే అది వాగితే ఎకౌంట్ బ్లాక్ అవుతుందని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారు.

ఇకపై తను వైసీపీపై రాజకీయ విమర్శలు చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించి మరీ రంగంలోకి దిగారు పృధ్వీ. మేం కూడా రెడీ అంటూ ఆయనకు సవాల్ విసురుతున్నారు మరికొంతమంది.

5 Replies to “మళ్లీ ట్రోలింగ్.. ఆ పని అప్పుడే చేయొచ్చుగా!”

  1. పోయే కాలం ఎదవకి…టీటీడీ లో మంచి పోస్ట్… ఇస్తే…కాపాడుకో లేక పోయాడు…

Comments are closed.