వైసీపీ రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వులు.. జీవిత కాలం ఆల‌స్యం!

వైసీపీ రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వులు ద‌క్క‌డం జీవిత కాలం ఆల‌స్య‌మ‌వుతోంద‌ని ఆ పార్టీ నేత‌లు వాపోతున్నారు.

వైసీపీ రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వులు ద‌క్క‌డం జీవిత కాలం ఆల‌స్య‌మ‌వుతోంద‌ని ఆ పార్టీ నేత‌లు వాపోతున్నారు. స్వ‌యంగా వైఎస్ జ‌గ‌న్ ఓకే చెప్పినా, నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి రెండు, మూడు నెల‌లవుతోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. వైసీపీలో పాల‌నాప‌ర‌మైన లోపాల‌ను నియామ‌క జాప్యాలు ప్ర‌తిబింబిస్తున్నాయి.

వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు, అలాగే జిల్లా అధ్య‌క్షుల సిఫార్సు, ఆమోదం త‌దిత‌ర స్థాయిల్ని దాటుకుని తాడేప‌ల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరి రెండు, మూడు నెల‌ల‌వుతోంది. అదేంటో గానీ, ఆ కార్యాల‌యంలో బాధ్య‌త‌ల్ని చూసే ముఖ్య నాయ‌కులు మాత్రం వాటికి జ‌గ‌న్‌తో అధికారిక ముద్ర వేయించ‌డానికి నెల‌ల స‌మ‌యం ప‌డుతోంది. అధికారంలో లేక‌పోయినా, పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నాయ‌కులు త‌మకంటూ ప్ర‌త్యేక చాంబ‌ర్ల‌ను ఏర్ప‌ర‌చుకుని ఏం పొడుస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు, పాల‌న‌లో ఇలాంటి ఉదాసీన‌, నిర్ల‌క్ష్య వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించార‌నే విమ‌ర్శ వుంది. ఇప్పుడు పార్టీలో కూడా అదే పునరావృతం అవుతోంది. దీంతో ఓట‌మి నుంచి వైసీపీ నేత‌లు ఏం గుణ‌పాఠం నేర్చుకున్నారో అర్థం కావ‌డం లేద‌ని అంగ‌ర్త‌గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇలాగైతే పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డ‌ద‌నే సంగ‌తిని గుర్తు చేసుకోవాల‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో అధికారాన్ని వెల‌గ‌బెడుతున్న నాయ‌కులు జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప‌నికొచ్చే ప‌నుల్ని చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నియామ‌క ఉత్త‌ర్వులు గుర్తు చేస్తున్నాయి.

11 Replies to “వైసీపీ రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వులు.. జీవిత కాలం ఆల‌స్యం!”

    1. మా అన్నయ్య ప్రతిపక్ష హోదా కోసం తిప్పలు పడుతుంటే

      క్యాడర్ పార్టీ పదవుల కోసం తిప్పలు పడుతున్నారు

    1. Red book ki icchinappudu ivvali ga direct ga cheppadu ga evvariki ekkuva cases vunte antha ekkuva padhavulu istanu ani meeku gurthu vundavu veedu chepthe oke enkevadu ayina ayithe wrong na

Comments are closed.