రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నాడా? కేసీఆర్ పాలనలో ఎంతటివారికైనా అపాయింట్‌మెంట్ దొరకదని అనేవారు. అప్పట్లో ఆయనది గడీల పాలన అని కాంగ్రెసు విమర్శలు చేసేది. కాని రేవంత్ రెడ్డి తమది ప్రజాపాలన అని చెప్పుకున్నారు. తనను ఎవరైనా, ఎప్పడైనా కలవొచ్చని చెప్పారు. చెప్పింది బాగానే ఉందిగాని చేసిన పని బాగాలేదనే విమర్శలు వస్తున్నాయి.
దీన్ని బీఆర్ఎస్ బాగా ఉపయోగించుకుంది. ఆ పార్టీ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. ఇంతకూ రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించారు? ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్యకు రోజుల తరబడి వేచిచూసినా రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన నిరాశగా వెనుదిరిగి వెళ్లారు.
గుమ్మడి నర్సయ్యకు అపాయింట్‌మెంట్ ఇవ్వని విషయం అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. అయినప్పటికీ సీఎం కార్యాలయంగాని, అధికారులుగాని, కాంగ్రెసు పార్టీగాని దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన గుమ్మడికి అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదో అర్థంకాడంలేదు. గుమ్మడి నర్సయ్య పరిచయం అక్కరలేని ప్రజా ఉద్యమకారుడు.
ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు. అలాంటి నేత.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, ఒకసారి కూడా సీఎం కనికరించలేదు. మొన్న రోజంతా జూబ్లీహిల్స్ అధికారిక నివాసం వద్ద.. నిన్న సెక్రటేరియట్ దగ్గర.. చివరకు గురువారం ఆయన ఇంటి వద్ద మరోసారి పడిగాపులు గాసినా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆయన్ను కలిసేందుకు ఇష్టపడలేదు.
చివరకు ఇంటిగేటుముందు గంటల తరబడి వేచి చూసిన నర్సయ్యకు నిరాశే మిగిలింది. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వెళ్తుంటే.. నర్సయ్య దీనంగా ఆయన వంక చూస్తు న్నా.. సీఎం చూసీచూడనట్టు వెళ్లిపోవటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. దీంతో ‘అయ్యో.. ఏందిసారూ ఇలా చేశారు.. పెద్దమనిషిని ఎండల తిప్పిస్తవా? ప్రజా సమస్య మీదనే వచ్చారుగా.. పాపం కలిసే అవకాశం ఇస్తే ఏమైంది?’ అని ప్రజా ఉద్యమకారులు రేవంత్‌రెడ్డిని అడుగుతున్నారు.
గుమ్మడి నర్సయ్యకు గురువారం తీవ్ర అవమానం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన రోజుల తరబడి ఎండలో వేచి చూసినప్పటికీ ఆయన్ను కలిసేందుకు సీఎం అంగీకరించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పోడు భూములపై గిజనులకు హక్కులు కల్పించాలని, సీఎం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో పడలేదని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావటం లేదని రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు గుమ్మడి నర్సయ్య హైదరాబాద్‌కు వచ్చారు.
తనకు పరిచయం ఉన్న అధికారుల ద్వారా సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. మంగళవారం ఉదయం సీఎం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉన్నట్టు తెలియటంతో అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు సీఎం కలిసే అవకాశం ఉందని సిబ్బంది చెప్పడంతో రోజంతా ఎండలోనే నిలబడి వేచిచూశారు. కానీ, సీఎం ఆయన్ను కలిసేందుకు అనుమతించలేదు. బుధవారం సీఎం సెక్రటేరియట్‌లో ఉన్నారనేసమాచారం అందుకున్న నర్సయ్య ఉదయమే అక్కడికి వెళ్లారు.
మరోసారి ముఖ్యమంత్రి అనుమతి కోసం ప్రయత్నించారు. తనకు పరిచయం ఉన్న అధికారులతో సీఎం కార్యాలయానికి ఫోన్ చేయించి సమాచారం ఇచ్చారు. ఏ సమయంలోనైనా సీఎం పిలవచ్చనే ఆశతో రోజంతా సెక్రటేరియట్ గేట్ బయటే పడిగాపులు కాచారు. దినం గడిచింది కానీ, సీఎం నుంచి పిలుపు రాకపోవడంతో ఆయన నిరాశతో వెనుదిరిగారు.
గురువారం ఉదయం మరోసారి సీఎం నివాసం జూబ్లీహిల్స్‌కు వెళ్లి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఎండలో గంటల తరబడి బయట వేచిచూసినప్పటికీ నర్సయ్యను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ముఖ్యమంత్రిని గమనించిన గుమ్మడి నర్సయ్య సీఎం కాన్వాయ్‌కి ఎదురెళ్లినా.. చూసీచూడనట్టుగా వెళ్లటంతో తీవ్ర అవమానంతో వెనుదిరిగారు. దీనిపై గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నా నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చిన.
ఇది మొదటిసారి కాదు. నాలుగోసారి. ఒక్కసారి కూడా సీఎం రేవంత్‌రెడ్డి నాకు అపాయింట్‌మెంట్ ఇయ్యలేదు. నేను ఎన్టీఆర్ దగ్గరి నుంచి మొదలు రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ వరకు ముఖ్యమంత్రులను చూశాను. ఏ సీఎం కూడా నన్ను ఇట్ల అవమానించలేదు. ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వటానికే వచ్చాను. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కావాలని కోరేందుకు వచ్చాను. రైతు భరోసా పడ్డదని సీఎం చెప్పిండ్రు. కానీ, ఇంతవరకు రైతు భరోసా అందలేదు.
ఈ సమస్యలు రేవంత్‌రెడ్డికి చెప్పటానికి మూడ్రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చిన. సీఎం ఇంట్లో ఉన్నాడంటే ఇంటికి పోయిన. సెక్రటేరియట్‌లో ఉన్నాడంటే అక్కడికి వెళ్లిన. ఇయ్యాల ఇంట్లనే ఉంటడంటే మళ్లీ ఇంటికి పోయిన. ఎన్నిసార్లు ప్రయత్నించినా కలువలేదు. రైతుబంధు ఇయ్యమని ఎవరడిగిండ్రు? కేసీఆర్ రూ.10 వేలు ఇస్తన్నడు.. నేను రూ.15 వేలు ఇస్త అని చెప్తివి. ఓట్లేయించుకొని గెలిచినంక రూ.12 వేలే ఇస్తంటివి. అవి కూడా ఇప్పటి వరకు పడకపాయే. రేవంత్‌రెడ్డి నాపై నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నట్టుగానే భావిస్తున్నా అని అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకిలా వ్యవహరించారో అర్థం కావడంలేదు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Anna aithe ministers ke appointment ichevaadu kaadu… narsaiah just ex MLA…
Mana annayane great…
Thana greatness meeda oka 10narticles rasey GA
ముక్కోడు మాట్లాడితే ఒక ఫుల్ ఇంకో హాఫ్ గట్టిగ వేసి ఫార్మ్ హౌస్ లో పడుకుంటాడు కవిత కలిపిచ్చేది, రేవంత్ రెడ్డి ఆలా కాదు కదా