Advertisement

Advertisement


Home > Movies - Movie News

షాకింగ్.. తమన్నకు అంత మార్కెట్ ఉందా?

షాకింగ్.. తమన్నకు అంత మార్కెట్ ఉందా?

ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలంటే ముందుగా గుర్తొచ్చేది నయనతార మాత్రమే. ఆ తర్వాత అనుష్క, సమంత లాంటి తారలు గుర్తొస్తారు. ఇక రెజీనా, శ్రద్ధా శ్రీనాధ్, ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్లు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నప్పటికీ వాటికి రీచ్-మార్కెట్ తక్కువగా ఉంటోంది. ఈ లిస్ట్ లో తమన్నది ఎప్పుడూ చివరి స్థానమే.

నిత్యం గ్లామరస్ పాత్రలు పోషించే తమన్న, ఫిమేల్ ఓరియంటెడ్ కథల వైపు పెద్దగా మొగ్గుచూపదు. మధ్యలో అలాంటివి 2-3 ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె తిరస్కరించింది. అయితే ఈమధ్య ఆమె తన రూటు మార్చింది. మంచి క్యారెక్టర్స్ దొరికితే నయనతార, అనుష్క టైపులో మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలనుకుంటోంది.

తమన్న అనుకున్నదే తడవుగా ఆమెకు ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ వచ్చింది. కథ కూడా తమన్నకు నచ్చింది. అయితే ఆమె చెప్పిన రేటుకు మేకర్స్ కు దిమ్మతిరిగింది. సదరు సినిమాలో నటించేందుకు ఏకంగా మూడున్నర కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట తమన్న.

లేడీ ఓరింటెడ్ సినిమాలకు మార్కెట్ అంతంతమాత్రం. ఇక తమన్నకైతే ఈ సెగ్మెంట్ లో ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేదు. అలాంటప్పుడు ఆమె అంత డిమాండ్ చేస్తుందని మేకర్స్ అస్సలు ఊహించలేదు. కానీ తమన్న మాత్రం షాకిచ్చింది. చూస్తుంటే.. ఈ ఆఫర్ కూడా తమన్న చేజారేలా ఉంది. 

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా