తమిళం వైపు టాలీవుడ్ చూపు

విజయ్ వారసుడు, ధనుష్ సార్ తరువాత తెలుగు దర్శకుల చూపు తమిళం వైపు బలంగా మళ్లుతోంది. కార్తీ, సూర్య, విజయ్ లాంటి పాపులర్ హీరోలకు సరిపడా కథలు వండడానికి మన దర్శకులు ప్రయత్నిస్తున్నారు. మన…

విజయ్ వారసుడు, ధనుష్ సార్ తరువాత తెలుగు దర్శకుల చూపు తమిళం వైపు బలంగా మళ్లుతోంది. కార్తీ, సూర్య, విజయ్ లాంటి పాపులర్ హీరోలకు సరిపడా కథలు వండడానికి మన దర్శకులు ప్రయత్నిస్తున్నారు. మన నిర్మాతలు కూడా తమిళ హీరోలతో సినిమాలు నిర్మించడానికి రెడీగా వున్నారు. 

తెలుగు హీరోలు చకచకా సినిమాలు చేయకుండా మీనం..మేషం లెక్కు పెడుతూ వుండడం, దానికి తగినట్లే దర్శకులు కూడా వ్యవహరిస్తుండడంతో తెలుగు నిర్మాతలు పక్క చూపులు చూడాల్సి వస్తోంది. పైగా తమిళంలో పెద్ద నిర్మాతలు తగ్గిపోతున్నారు.

ముందుగా ఆసియన్ సునీల్ తెలుగు దర్శకుడు అనుదీప్ ను తీసుకెళ్లి ప్రిన్స్ సినిమా తీసారు. పెద్ద ఆడగకపోయినా, కొంత వెనక్కు ఇచ్చుకున్నా మంచి లాభాలే మిగిలాయి. తరువాత ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా ప్లాన్ చేసారు. కానీ ఈలోగా ధనుష్-వెంకీ అట్లూరి సినిమా వచ్చింది. అది కూడా మంచి లాభాలు చేసుకుంది. మరోపక్కన విజయ్ తో దిల్ రాజు భారీ సినిమా తీసారు వంశీ పైడిపల్లిని తీసుకెళ్లి. అది కూడా మంచి లాభాలే ఇచ్చింది. ఆయనే మరో సినిమాను శంకర్ – రామ్ చరణ్ లతో చేస్తున్నారు. విజయ్ తో ఇంకో సిన్మా ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు దర్శకులు పలువురు ఇప్పుడు విజయ్, కార్తీ, సూర్య లకు కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా యష్ వైపు కూడా ఓ చూపు వేసి వుంచారు. రజనీకాంత్ కూడా తెలుగు దర్శకులు సరైన కథ తెస్తే చేసే ఆలోచనలో వున్నారు. గోపీచంద్ మలినేని, బాబి లాంటి హిట్ డైరక్టర్లకు తెలుగులో రెడీగా హీరోలు లేరు. అందుకే వాళ్లకి ఆప్షన్ పక్క భాష హీరోలే. ఇలాగే హిట్ లు ఇచ్చి కూడా ఇంకా చాలా మంది లైన్ లో అలా వున్నారు. మరో పక్కన నిర్మాతలు చకచకా సినిమాలు చేయాలనుకుంటున్నారు. కానీ ప్రాజెక్ట్ లు దొరకడం లేదు.

మొత్తం మీద నిర్మాతలు, దర్శకులు అంతా కలిసి తమిళ సినిమాల కేసి చూస్తున్నారు.