Advertisement

Advertisement


Home > Movies - Movie News

తమిళనాట బిగ్ రిలీజ్

తమిళనాట బిగ్ రిలీజ్

సాధారణంగా మన సినిమాలు తమిళ నాట 100 నుంచి 150 థియేటర్లలో విడుదలవుతాయి. అదే తమిళ్‌లో నేరుగా విడుదల చేసుకుంటే, ఆ లాంగ్వేజ్ ఎక్కువగా, మన లాంగ్వేజ్ తక్కువగా అన్నీ కలిపి విడుదల చేస్తారు.

సంక్రాంతి సీజన్ లో అయితే మనం ఎక్కువ థియేటర్లు తీసుకుందాం అనుకున్నా అది కుదిరే పని కాదు. డియర్ కామ్రేడ్, నోటా, లైగర్ ఇలా చాలా సినిమాలు నాలుగైదు భాషల్లో విడుదల చేసాడు హీరో విజయ్ దేవరకొండ. ఆ మేరకు భయంకరంగా పబ్లిసిటీ కూడా చేసారు. ఖుషీ సినిమాను కూడా తమిళ నాట 100 కు పైగా థియేటర్లలో విడుదల చేసారు.

రాను రాను మన హీరోలు కూడా తమిళ నాట బాగా పాపులర్ అవుతున్నారు. అందువల్ల మార్కెట్ పెరుగుతోంది. ఈవారం విడుదలవుతున్న ఫ్యామిలీస్టార్ సినిమాను ఏకంగా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

విజయ్ కు ఇది భారీ రిలీజ్ అనే చెప్పాలి. ఈ 250 థియేటర్లలో కొన్నింటిలో తమిళ వెర్షన్లు, కొన్నింటిలో తెలుగు వెర్షన్లు వేస్తున్నారు. మృణాళ్ ఠాకూర్ కు కూడా తమిళనాట కాస్త పరిచయం బాగానే వుండడం, ఫ్యామిలీ సినిమా కావడం, అన్నింటికి మించి తమిళ విజయ్ సినిమా నిర్మాతగా దిల్ రాజు బ్యానర్ అక్కడ పరిచయం కావడం వల్ల ఇన్ని థియేటర్లలో విడుదల పాజిబుల్ అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?