నాగ్ చైతన్య- చందు మొండేటి కాంబినేషన్ లో గీతా సంస్ధ నిర్మిస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడి కథ నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. లవ్ స్టోరీ తరువాత మళ్లీ అదే జోడీ. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చందు మొండేటి సినిమా. 100 పర్సంట్ లవ్ తరువాత చైతూ- గీతా సినిమా, ఇలా ఇవన్నీ కలిసి ఈ సినిమా మీద అంచనాలు పెంచాయి.
ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూలు విశాఖలో నిన్నటితో ముగిసింది. షూటింగ్ ముగించుకుని చైతూ చెన్నయ్ కు వెళ్లిపోయారు. ఈ షెడ్యూలుతో చాలా వరకు సినిమా పూర్తయింది. మరో రెండు షెడ్యూళ్లు హైదరాబాద్ లో, ఢిల్లీలో వుంటాయి. ఒకటి రెండు పాటలు, ఓ ఫైట్ చిత్రీకరించాల్సి వుంది.
సినిమాలో రెండు బిట్ సాంగ్స్, నాలుగు మెయిన్ సాంగ్స్ వుంటాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో మంచి ట్యూన్ లు చేయించుకున్నారు. అంతా బాగానే వుంది కానీ విడుదల డేట్ ఇప్పుడు సందిగ్దంలో పడింది.
పుష్ప 2, గేమ్ ఛేంజల్ లాంటి మెగా కనెక్షన్ వున్న సినిమాలు డిసెంబర్ లో వస్తున్నాయి. అందువల్ల అక్కడి నుంచి వెనక్కో, ముందుకో జరగాల్సిన పరిస్థితి వచ్చింది తండేల్ కు.