తనను పొగడక పోయినా, ఇతరులను తిడితే కొందరు మహానందానికి లోనవుతుంటారు. దీన్నే పైశాచిక ఆనందం అని పిలుస్తారు. ఇటీవల ఇలాంటి క్యారెక్టర్లు బాగా పెరిగాయి. ఎవరేమనుకున్నా హీరోయిన్ తాప్సీ ఈ కోవలోకి వస్తుందని చిత్రపరిశ్రమ గుసగుసలాడుతోంది. అయితే సినిమా అభిమానులు ఊరికే అలాంటి అభిప్రాయానికి రాలేదు. దాని వెనుక కథకాని కథ ఒకటి ఉంది. దాని గురించే ఇప్పుడు చెప్పుకొందాం.
కంగనా సోదరి రంగోలి గురించి తెలుసు కదా? ఆమె తెలియకపోవడం ఏంటి అంటారా? అవునవును ఆమె గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే నోరున్న వాళ్లదే రాజ్యం అయినప్పుడు …రంగోలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు నోటి దురుసు ఎక్కువనే పేరు ఉంది కదా!
ఆవిడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంది. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారోనని ఆమె ఏ మాత్రం ఆలోచించదు. తానేమి అనుకుంటే అదే మాట్లాడుతుంటుంది. అంతే తప్ప ఆ మాటల పర్యవసానాల గురించి అసలు లెక్క చేయదు. తన సోదరి కంగన తరఫున రంగోలి అనేస్తోంది. ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డుల గురించి కంగనా మాట్లాడకపోయినా, రంగోలి మాత్రం నోటికి పని చెప్పింది. ఈ సందర్భంగా ఆలియాను ఓ ఆట ఆడుకుంది. మళ్లీ తెలిసిన విషయాలనే ఇక్కడ చెప్పుకోవడం అనవసరం.
అయితే రంగోలి నోట తన పేరు రాకపోవడం తాప్సీ గౌరవంగా భావిస్తోందట. ఎందుకంటే తాప్సీకి కూడా ఓ అవార్డు వచ్చింది. తనకు న్యాయబద్ధంగా అవార్డు వచ్చింది కనుకే రంగోలి ఏమీ అనలేదని రంగోలి తన గురించి ఏమీ మాట్లాడకపోవడాన్ని తనకు అనుకూలంగా తాప్సీ మలుచుకుంటోందట. అందుకే ఆమెకు సంబరమట! అయితే ఆలియాకు న్యాయబద్ధంగా రాలేదనా? అని బాలీవుడ్ అభిమానులు, ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. అయినా రంగోలీ అవార్డు జ్యూరీ సభ్యురాలు కాదు కదా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఎవరేమనుకున్నా ఆలియాకు తలంటు పోసి, తనను ముట్టుకోకపోవడంపై తాప్సీ మాత్రం భలే ఆనందపడిపోతోందట. మరీ ఇంత శాడిజమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.